వారాంతంలో లాభ‌ప‌డిన మార్కెట్లు

వ‌రుస న‌ష్టాల‌కు అడ్డుక‌ట్ట‌ప‌డింది. శుక్ర‌వారం దేశీయ మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి

వారాంతంలో లాభ‌ప‌డిన మార్కెట్లు

వరుస నష్టాలతో సతమతమవుతూ అయిదు నెలల కనిష్ఠానికి చేరిన దేశీయ సూచీలు ఎట్టకేలకు లాభపడ్డాయి. ప్రారంభంలో భారీగా న‌ష్ట‌పోయిన మార్కెట్లు మ‌ధ్యాహ్నం త‌ర్వాత ట్రేడింగ్‌లో కోలుకున్నాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 99.90 పాయింట్లు లాభపడి 37,118.22 వ‌ద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీ 17.35 పాయింట్ల లాభంతో 10,997.35 వద్ద ముగిసింది.

అంత‌ర్జాతీయ మార్కెట్ల ప్ర‌తికూల సంకేతాలు ప్రారంభంలో మార్కెట్ల‌ను క‌ల‌వ‌ర‌పెట్టాయి. అయితే జులై నెల‌లో జీఎస్‌టీ వ‌సూళ్లు రూ.1.02 ల‌క్ష‌ల కోట్లుగా న‌మోదు కావ‌డంతో కొంత క‌లిసొచ్చింది. మ‌రోవైపు ఆగ‌స్ట్, సెప్టెంబ‌ర్ నెల‌ల్లో సాధార‌ణ వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ తెల‌ప‌డంతో మార్కెట్ వ‌ర్గాలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. ఆసియా మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.69.56 వ‌ద్ద కొన‌సాగుతోంది.

నిఫ్టీలో నేడు లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…

0208.jpg

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly