మిశ్ర‌మంగా ముగిసిన సూచీల ట్రేడింగ్

దేశీయ సూచీలు నేడు ఫ్లాట్‌గా ట్రేడింగ్ ముగించాయి. నిఫ్టీ 12,050 కంటే దిగువ‌కు చేరింది.

మిశ్ర‌మంగా ముగిసిన సూచీల ట్రేడింగ్

దేశీయ మార్కెట్లు సోమవారం స్త‌బ్దుగా ముగిశాయి. నేటి ఉద‌యం జోరుగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి నెమ్మ‌దించాయి. ఆ త‌ర్వాత‌ తీవ్ర ఒడుదొడుకుల‌కు లోనైన సెన్సెక్స్ చివ‌రికి స్వ‌ల్పంగా 8.36 పాయింట్ల లాభంతో 40,802.17 వ‌ద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీ 7.85 పాయింట్ల న‌ష్టంతో 12,048.20 వ‌ద్ద ముగిసింది.

ఉద‌యం సెన్సెక్స్ 100 పాయింట్ల‌కు పైగా లాభ‌ప‌డ‌గా, నిఫ్టీ 12,050 పైన ట్రేడింగ్ ప్రారంభించాయి. ఆ త‌ర్వాత ఆరంభ జోరుకు బ్రేకు ప‌డింది. మ‌దుప‌ర్ల అప్ర‌మ‌త్త‌త వ‌హించ‌డంతో తిరిగి స్వ‌ల్ప న‌ష్టాల్లోకి జారుకున్నాయి. ఆర్‌బీఐ ప‌ర‌ప‌తి సమీక్ష‌తో పాటు నేడు వెల్ల‌డికాఉన్న త‌యారీ వృద్ధి గ‌ణాంకాల‌పై మ‌దుప‌ర్లు దృష్టి వ‌హించారు. నవంబ‌ర్‌లో వాహ‌నాల విక్ర‌యాలు త‌గ్గ‌డంతో ఆయా కంపెనీల షేర్లు త‌గ్గిపోయాయి. మ‌రోవైపు టెలికాం కంపెనీల ఛార్జీల పెంపు ప్ర‌క‌ట‌న చేయ‌డంతో షేర్లు పుంజుకున్నాయి. చివ‌రికి సూచీలు మిశ్ర‌మంగా ట్రేడింగ్ ముగించాయి. ఆసియా మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.71.66 వ‌ద్ద కొన‌సాగుతోంది.

నిఫ్టీలో నేడు లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…

0212.jpg

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly