చివ‌రికి స్వ‌ల్ప లాభాల‌తో ముగింపు

ప్రారంభం నుంచి ఒడుదొడుకుల‌తో కొన‌సాగిన మార్కెట్లు చివ‌రికి స్వ‌ల్ప లాభాల‌తో ముగిశాయి.

చివ‌రికి  స్వ‌ల్ప లాభాల‌తో ముగింపు

ఆర్‌బీఐ ద్ర‌వ్య‌ప‌ర‌ప‌తి స‌మీక్ష నేప‌థ్యంలో మ‌దుప‌ర్లు అప్ప‌మ‌త్త‌త వ‌హించ‌డంతో నేడు ప్రారంభం నుంచి సూచీలు ఒత్తిడికి గుర‌య్యాయి. దీనికి తోడు ద్ర‌వ్యోలోటు బ‌డ్జెట్ డిసెంబరు చివరినాటికే అంచ‌నాల కంటే 12 శాతం పెరిగింద‌నే స‌మాచారంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బ‌తింది. అయితే చివ‌ర్లో కాస్త కోలుకున్న సూచీలు స్వ‌ల్ప లాభాల‌ను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 34.07 పాయింట్ల లాభంతో 36,616.81వద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీ 22.10 పాయింట్ల లాభంతో 10,934.35 వద్ద ముగిసింది. ప్రారంభం నంచి హెచ్చుత‌గ్గుల‌కు లోనైన సూచీలు కొన్ని కంపెనీల‌ షేర్లు లాభ‌ప‌డ‌టంతో కాస్త కోలుకున్నాయి. ఆటోమొబైల్‌సూచీ అత్యధికంగా లాభపడింది. హీరోమోటో కార్ప్‌, బజాజ్‌ ఆటో, మారుతీ సుజుకీ వంటి సంస్థల షేర్లు దూసుకెళ్లాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో ఆ షేరు లాభపడింది. జీ గ్రూప్ సంస్థ‌కు, రుణదాతల బృందానికి మధ్య ఒక ఒప్పందం కుద‌ర‌డంతో నేడు కంపెనీ షేర్లు తిరిగి లాభాల్లోకి వ‌చ్చాయి. ఆసియా మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి.

నేడు నిఫ్టీలో లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు …

0502.jpg

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly