ప‌త‌న‌మైన మార్కెట్లు

దేశీయ సూచీలు కీల‌క స్థాయుల‌ను కోల్పోయాయి. సెన్సెక్స్ 36 వేల దిగువ‌కు చేరింది.

ప‌త‌న‌మైన  మార్కెట్లు

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, రూపాయి బలహీనపడటం తదితర పరిణామాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను నేడు తీవ్రంగా దెబ్బతీశాయి. దీనికి తోడు ఆటోమొబైల్‌, లోహ, ఆర్థిక, వినియోగ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలతో మార్కెట్లు భారీగా క్షీణించాయి. చివ‌రికి సెన్సెక్స్ 572 పాయింట్లు నష్టపోయి 35,312 వద్ద, నిఫ్టీ 182 పాయింట్లు దిగజారి 10,601 వద్ద స్థిరపడ్డాయి.

ఆసియా మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో ఈ ఉదయం సూచీలు బలహీనంగా ప్రారంభమయ్యాయి. మార్కెట్‌ ఆరంభంలోనే సెన్సెక్స్‌ 300 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ కూడా 10,700 దిగువన ట్రేడ్‌ అయ్యింది. మధ్యాహ్నానికి కాస్త కోలుకున్నట్లే కన్పించినా… చమురు ఉత్పత్తి, సరఫరాపై నేడు జరగబోయే ఓపెక్‌ సమావేశం, శుక్రవారం సాయంత్రం వెలువడబోయే రాష్ట్రాల ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలపై దృష్టి పెట్టిన మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో ఒత్తిడికి గురైన సూచీలు మరింత పతనమయ్యాయి. ఫలితంగా నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 570 పాయింట్లు, నిఫ్టీ 180 పాయింట్లు కోల్పోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.82గా కొనసాగుతోంది.

నిఫ్టీలో నేడు స‌న్ ఫార్మా, జేఎస్‌డ‌బ్య్లూ కంపెనీల షేర్లు మాత్ర‌మే స్వ‌ల్పంగా లాభ‌ప‌డ‌గా, మిగ‌తా అన్ని కంపెనీల షేర్లు న‌ష్ట‌పోయాయి.
0612.jpg

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly