భారీ లాభాల‌ను న‌మోదు చేసిన మార్కెట్లు

నేడు సెన్సెక్స్ 636 పాయింట్లు లాభ‌ప‌డ‌గా, నిఫ్టీ 11 వేల కీల‌క స్థాయిని దాటింది

భారీ లాభాల‌ను న‌మోదు చేసిన మార్కెట్లు

నేడు దేశీయ మార్కెట్లు భారీ లాభాల‌ను న‌మోదు చేశాయి. ప్రారంభం నుంచి నేడు కొంత సానుకూల‌త‌నే క‌న‌బ‌రిచిన మార్కెట్లు మొత్తానికి తిరిగి పుంజుకున్నాయి. నేడు ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్ 636.86 పాయింట్ల లాభంతో 37,327.36 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ 176,95 పాయింట్ల లాభంతో 11,032.45 వ‌ద్ద స్థిర‌ప‌డింది. భార‌త వాత‌వార‌ణ శాఖ నుంచి వెల్ల‌డైన‌ సానుకూల వ‌ర్ష‌పాత నివేదిక‌ కూడా మార్కెట్ వ‌ర్గాల‌ను ఉత్సాహ‌ప‌రిచింది.

బుధవారం భారీ నష్టాలతో ముగిసిన దేశీయ సూచీలు గురువారం కోలుకున్నాయి. భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా విదేశీ పోర్టు ఫోలియో ఇన్వెస్టర్లపై అధిక సర్‌ఛార్జీ విధించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకుంటుందన్న వార్తలు మార్కెట్లకు మరింత బలాన్ని ఇచ్చాయి. ఒకానొక దశలో ఇంట్రాడే గరిష్ఠం 37,405పాయింట్లను తాకింది. ఆ త‌ర్వాత కొంత త‌గ్గిన‌ప్ప‌టికీ భారీ లాభాల‌నే న‌మోదు చేసింది. నిఫ్టీ కూడా 11వేల పాయింట్ల మార్కును దాటింది. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.70.63 వ‌ద్ద కొన‌సాగుతోంది. ఆసియా మార్కెట్లు లాభాలతో ముగిశాయి.

నేడు నిఫ్టీలో లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…

0808.jpg

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly