వారాంతంలో న‌ష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు

సెన్సెక్స్ క్రితం 40,600 నుంచి నేడు 40,300 వ‌ద్ద‌కు త‌గ్గింది. నిఫ్టీ కూడా 12 వేల నుంచి త‌గ్గి 11,900 వ‌ద్ద స్థిర‌ప‌డింది

వారాంతంలో   న‌ష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు

దేశీయ మార్కెట్లు వారాంతంలో న‌ష్టాల‌తో ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్ 330.13 పాయింట్ల న‌ష్టంతో 40,323.61 వ‌ద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీ 103.90 పాయింట్ల న‌ష్టంతో 11,908.15 వ‌ద్ద ముగిసింది. ఉద‌యం నుంచి ఒత్తిడికి లోన‌యిన సూచీలు చివ‌రికి న‌ష్టాల‌ను మూట‌గ‌ట్టుకున్నాయి. క్రితం ట్రేడింగ్‌లో కొత్త శిఖ‌రాల‌కు చేరిన మార్కెట్లు నేడు తిరిగి న‌ష్టాల్లోకి జారుకున్నాయి. మూడీస్ దేశ రేటింగ్ అవుట్‌లుక్ స్థాయిని త‌గ్గించ‌డంతో మార్కెట్ వ‌ర్గాల‌లో నిరాశ ఎదురైంది. చివ‌రిగంట‌లో అమ్మ‌కాలు పెర‌గ‌డంతో కీల‌క స్థాయుల నుంచి సూచీలు దిగువ‌కు చేరాయి. ఆసియా మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.71.24 వ‌ద్ద కొన‌సాగుతోంది.

నేడు నిఫ్టీలో లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…

0811.jpg

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly