వారాంతంలో లాభాల‌తో ముగిసిన మార్కెట్లు

శుక్ర‌వారం మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి. సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 11,100 పైకి చేరింది

వారాంతంలో  లాభాల‌తో ముగిసిన మార్కెట్లు

వరుసగా రెండో రోజు దలాల్‌స్ట్రీట్‌ లాభాలతో కళకళలాడింది. ఎఫ్‌పీఐలపై సర్‌ఛార్జ్‌ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందనే వార్తలతో శుక్రవారం కూడా దేశీయ మార్కెట్లు లాభాల్లో పరుగులు తీశాయి. దీంతో వారాంతంలో సెన్సెక్స్ 254.55 పాయింట్ల లాభంతో 37,581.90 వ‌ద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీ 77.20 పాయింట్ల లాభంతో 11,109,65 వ‌ద్ద ముగిసింది.

సర్‌ఛార్జీల తొలగింపు వార్తలతో గురువారం నాటి సెషన్‌లో భారీ లాభాలను ఆర్జించిన సూచీలు నేడు కూడా అదే ఉత్సాహంతో ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్‌, ఎనర్జీ షేర్లలో కొనుగోళ్ల అండతో సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. నిఫ్టీ కూడా లాభాలతో మొదలైంది. మధ్యాహ్నం సమయంలో మరింత దూసుకెళ్లిన సెన్సెక్స్‌ ఒక దశలో 400 పాయింట్లకు పైగా లాభపడింది. అయితే చివర్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడపంతో రోజు గరిష్ఠాల నుంచి సూచీలు వెనక్కి వచ్చాయి. నేటి సెషన్‌లో సెన్సెక్స్ 250 పాయింట్లకు పైగా లాభపడగా… నిఫ్టీ 11,100 పైకి చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.70.75 గా కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లు మిశ్ర‌మంగా ముగిశాయి.

నేడు నిఫ్టీలో లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…

0908.jpg

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly