చివ‌రికి స్వ‌ల్ప లాభాల‌తో ముగింపు

దేశీయ సూచీలు చివ‌రికి స్వ‌ల్ప లాభాల‌కు ప‌రిమితం అయ్యాయి. నిఫ్టీ 12 వేల‌కు దిగువ‌లో ముగిసింది

చివ‌రికి స్వ‌ల్ప లాభాల‌తో ముగింపు

అమ్మ‌కాల ఒత్తిడి, విదేశీ పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ, వ‌డ్డీరేట్ల‌పై ఆర్‌బీఐ నిర్ణ‌యాలు వంటి కార‌ణాల‌తో దేశీయ మార్కెట్లు నేడు ఒడుదొడుకుల‌కు గుర‌య్యాయి. చివ‌రికి సెన్సెక్స్ 42.28 పాయింట్ల లాభంతో 40,487.43 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 11,937.50 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 70 పాయింట్ల వ‌ర‌కు కోల్పోయింది. అయితే ఆ త‌ర్వాత కాస్త కోలుకున్నా…దిగ్గ‌జ షేర్ల‌లో అమ్మ‌కాలు మార్కెట్లను ఒత్తిడికి గురిచేశాయి. ఇలా ఆద్యంతం ఒడుదొడుకుల‌కు గురైన సూచీలు చివ‌రికి స్వ‌ల్ప లాభాల‌తో ట్రేడింగ్ ముగించాయి. ఆసియా మార్కెట్లు నేడు లాభాల‌తో ముగిశాయి. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.71.05 వ‌ద్ద కొన‌సాగుతోంది.

నిఫ్టీలో నేడు లాభ, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…

0912.jpg

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly