లాభాల‌తో ముగిసిన మార్కెట్లు..

నేడు సెన్సెక్స్ 100 పాయింట్లు లాభ‌ప‌డ‌గా, నిఫ్టీ 10,460 వ‌ద్ద ముగిసింది.

లాభాల‌తో ముగిసిన మార్కెట్లు..

వ‌రుస న‌ష్టాల త‌ర్వాత బుధ‌వారం దేశీయ మార్కెట్లు కోలుకున్నాయి. బ్యాంకింగ్‌, ఆటో రంగ షేర్ల కొనుగొళ్ళు పెర‌గ‌డంతో న‌ష్టాల నుంచి తేరుకుని లాభాల‌ను గ‌డించాయి. చివ‌రికి సెన్సెక్స్ 461.42 పాయింట్ల లాభంతో 34,760.89 వ‌ద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీ 159.05 పాయింట్లు లాభ‌ప‌డి 10,460.10 వ‌ద్ద ముగిసింది.

గ‌త కొద్ది రోజులుగా భారీగా న‌ష్ట‌పోయిన సూచీలు నేడు ట్రేడింగ్‌ను లాభాల‌తో ప్రారంభించాయి. తొలి గంటల్లో సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అయ్యింది. నిఫ్టీ కూడా లాభాల్లో సాగింది. అంత‌ర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్లుకు మ‌ద్ద‌తునిచ్చాయి. ఐఎమ్ఎఫ్ ప్ర‌పంచ వృధ్ధి రేటు అంచ‌నాను త‌గ్గించ‌డంతో చ‌మురు ధ‌ర‌లు బ్యార‌ల్కు 84.98 డాల‌ర్ల‌కు త‌గ్గాయి. డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి మార‌కం విలువ పెరగ‌డంతో ఆసియా మార్కెట్లు లాభాల బాట ప‌ట్టాయి. ,
నిఫ్టీలో నేడు లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…

mak1.jpg

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly