న‌ష్ట‌పోయిన మార్కెట్లు

దేశీయ సూచీలు నేడు న‌ష్టాల‌తో ట్రేడింగ్ ముగించాయి. నిఫ్టీ 11,900 దిగువ‌కు చేరింది

న‌ష్ట‌పోయిన మార్కెట్లు

దిగ్గ‌జ షేర్ల అమ్మ‌కాలు పెర‌గ‌డంతో దేశీయ మార్కెట్లు మంగ‌ళ‌వారం భారీ న‌ష్టాల‌తో ముగిశాయి. సెన్సెక్స్ 247.55 పాయింట్ల న‌ష్టంతో 40,230.88 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ 80.70 పాయింట్ల న‌ష్టంతో 11,856.80 వ‌ద్ద స్థిర‌ప‌డింది. ఉద‌యం స్టాక్ మార్కెట్లు స్త‌బ్దుగా ట్రేడింగ్ ప్రారంభించాయి. ఆ త‌ర్వాత కీల‌క షేర్ల అమ్మ‌కాలు పెర‌గ‌డంతో మార్కెట్లు న‌ష్టాల్లోకి జారుకున్నాయి. విదేశీ పెట్టుబ‌డులు పెరిగిన‌ప్ప‌టికీ మ‌దుపర్లు ఆ సంకేతాల‌ను అందిపుచ్చుకోలేదు. ఏప్రిల్‌-న‌వంబ‌ర్ కాలంలో జీఎస్‌టీ వ‌సూళ్లు త‌గ్గిన‌ట్లు నివేదిక తెల‌ప‌డంతో ప్ర‌తికూల‌త ఏర్ప‌డింది. ఆసియా మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.70.91 వ‌ద్ద కొన‌సాగుతోంది.

నేడు నిఫ్టీలో లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…

1012.jpg

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly