ఇలా ముగిసాయి!

అమ్మ‌కాలు పెర‌గ‌డంతో దేశీయ మార్కెట్లు వారాంతంలో న‌ష్టాల‌నున‌మోదు చేశాయి

ఇలా ముగిసాయి!

దేశీయ మార్కెట్లు శుక్ర‌వారం న‌ష్టాల‌తో ట్రేడింగ్ ముగించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం సమయానికి నష్టాల్లోకి జారుకున్నాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాలు నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత వ‌హించారు. సెన్సెక్స్ 6.66 పాయింట్లు కోల్పోయి 36009.84 వద్ద ముగిసింది. నిఫ్టీ 26.60 పాయింట్లు నష్టపోయి 10795 పాయింట్లకు చేరింది. నేడు ఉద‌యం సెన్సెక్స్‌ 80 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభం కాగా, నిఫ్టీ 10,800 పైన ఆరంభమైంది. నేడు న‌వంబ‌ర్‌ నెలకు సంబంధించిన‌ ఐఐపీ గ‌ణాంకాలు వెల్ల‌డి కానుండ‌టంతో మ‌దుపర్లు అప్ర‌మ‌త్త‌త వ‌హించారు. ఎంఎస్ఈల‌కు ఊర‌ట క‌లిగించేలా జీఎస్‌టీ కౌన్సిల్ ప‌న్ను మిన‌హాయింపును పెంచ‌డంతో ఉద‌యం కొంత సానుకూలంగానే కొన‌సాగిన మార్కెట్లు ఆ త‌ర్వాత న‌ష్టాల్లోకి జారుకున్నాయి. టెలికాం, స్థిరాస్తి, క్యాపిట‌ల్ గూడ్స్ రంగాల షేర్ల అమ్మ‌కాలు పెర‌గ‌డంతో చివ‌రికి న‌ష్టాల‌తో ముగిశాయి. ఆసియా మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.54 వద్ద ట్రేడవుతోంది.

నిఫ్టీలో నేడు లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…

1101.jpg

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly