మార్కెట్ల‌కు లాభాల పంట‌

సోమ‌వారం మార్కెట్లు భారీ లాభాల‌ను మూట‌గ‌ట్టుకున్నాయి. సెన్సెక్స్ 37 వేల మార్క్‌ను చేర‌గా, నిఫ్టీ 11,160 వ‌ద్ద ముగిసింది.

మార్కెట్ల‌కు లాభాల పంట‌

నేడు స్టాక్ మార్కెట్ల‌లో జోరు కొన‌సాగింది. 2019 ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ గెలిచే అవకాశాలున్నట్లు విశ్లేషకుల అంచనాలతో దేశీయ మార్కెట్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఫలితంగా సోమవారం నాటి మార్కెట్లో సూచీలు భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి. చివ‌రికి సెన్సెక్స్ 382.67 పాయింట్ల లాభంతో 37,054.10 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ 132.65 పాయింట్లు లాభ‌ప‌డి11,168.05 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

ప్రారంభం నుంచే మార్కెట్ల లాభాల జోరు మొదలైంది. బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌, లోహ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 200 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్‌ ఏ దశలోనూ వెనక్కి తిరిగి చూడలేదు. కొనుగోళ్ల అండతో భారీ లాభాన్ని దక్కించుకుంది. సెన్సెక్స్ 380 పాయింట్లు లాభ‌ప‌డి కీల‌క‌మైన 37 వేల మార్క్‌ను దాట‌గా, నిఫ్టీ 11150 పైకి చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.91గా కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లు మిశ్ర‌మంగా ముగిశాయి.

నేడు నిఫ్టీలో లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…
1103.jpg

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly