లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నేడు లాభాల‌తో ట్రేడింగ్ ముగించాయి. నిఫ్టీ 11,600 చేరువ‌లో ఉంది.

లాభాల‌తో ముగిసిన స్టాక్    మార్కెట్లు

గురువారం దేశీయ సూచీలు ఉత్సాహంగా ట్రేడ‌య్యాయి. త్వరలోనే వడ్డీ రేట్ల కోత ఉండొచ్చని యూఎస్‌ ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పోవెల్‌ సంకేతాలివ్వడం అంతర్జాతీయ మార్కెట్లకు కలిసొచ్చింది. ఆ సానుకూల సంకేతాలను దేశీయ మార్కెట్లు కూడా అందిపుచ్చుకున్నాయి. ఫలితంగా సూచీలు లాభాల్లో ముగిశాయి. చివ‌రికి సెన్సెక్స్ 266.07 పాయింట్ల లాభంతో 38,823.11 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 84 పాయింట్లు లాభపడి 11,582.90 వద్ద స్థిరపడింది.

కొనుగోళ్ల కళతో ఈ ఉదయం సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్‌ మార్కెట్‌ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలను సాధించాయి. ఆసియా మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 68.43గా కొనసాగుతోంది.

నేడు నిఫ్టీలో లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…
1107.jpg

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly