మ‌ళ్లీ న‌ష్ట‌పోయిన మార్కెట్లు

ఉద‌యం నుంచి ఒడుదొడుకుల‌కు లోనైన మార్కెట్లు చివ‌రికి న‌ష్టాల‌తో ముగిశాయి.

మ‌ళ్లీ న‌ష్ట‌పోయిన మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో సోమవారం నాటి ట్రేడింగ్‌లో భారీ లాభాల్లో దూసుకెళ్లిన దేశీయ మార్కెట్లు నేడు మాత్రం ఆ జోరును కొనసాగించలేకపోయాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఆరంభం నుంచే ఒత్తిడికి గురైన సూచీలు చివరకు మిశ్రమ ఫలితాలను సాధించాయి. సెన్సెక్స్ 61.16 పాయింట్లు నష్ట‌పోయి 33,856 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ 5.45 పాయింట్ల లాభంతో 10,426.85 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

ఈ ఉదయం స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సూచీలు… ఆ తర్వాత కాసేపటికి కోలుకున్నట్లే కన్పించాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 120 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగింది. అయితే ఆ తర్వాత మదుపర్ల అమ్మకాల వెల్లువతో తీవ్ర ఒత్తిడికి లోనైన సూచీ ఆరంభ లాభాలను కోల్పోయింది. చివరకు 61 పాయింట్లు కోల్పోయి 33,857 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ మాత్రం కాస్త కోలుకుని స్వల్ప లాభంతో సరిపెట్టుకుంది. నేటి ట్రేడింగ్‌లో అత్యల్పంగా 5 పాయింట్లు లాభపడి 10,427 వద్ద ముగిసింది.

నిఫ్టీలో నేడు లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన కంపెనీల షేర్ల వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.
1303.jpg

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly