భారీగా ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు

నేడు సెన్సెక్స్‌ ఏకంగా 624 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 11,000 కంటే దిగువ‌కు చేరింది.

భారీగా ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. అంత‌ర్జాతీయ మార్కెట్ల న‌ష్టాలు దేశీయ మార్కెట్ల‌పై ప్ర‌భావం చూపాయి. జులై నెల‌లో ప్యాసింజ‌ర్ వాహ‌నాల విక్ర‌యాలు త‌గ్గ‌డంతో ఆటో రంగ షేర్లు భారీగా న‌ష్ట‌పోయాయి. ముఖ్యంగా అమెరికా, యూరప్‌ మార్కెట్ల ఈక్విటీ ఫ్యూచర్లు మంగళవారం పడిపోవడం దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఈక్విటీ మార్కెట్లు ఒత్తిడికి లోనుకావడంతో బంగారం ధర పెరిగింది. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 623.75 పాయింట్లు క్షీణించి 36,958 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ 183.80 పాయింట్ల న‌ష్టంతో 10,925,85 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

దేశీయ మార్కెట్లు నేడు కుప్ప‌కూలాయి. సూచీలు కీల‌క స్థాయుల‌ను కోల్పోయాయి. సెన్సెక్స్‌ ఏకంగా 624 పాయింట్లు పతనమై 36,958 వద్ద, నిఫ్టీ 184 పాయింట్లు కోల్పోయి 10,926 వద్ద స్థిరపడ్డాయి. ముఖ్యంగా యస్‌బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు భారీగా విలువ కోల్పోయాయి. మరోవైపు రిలయన్స్ 10 శాతం లాభపడ్డా మార్కెట్‌ పతనాన్ని ఆపలేకపోయింది. సెక్టార్ల వారీగా చూస్తే ఆటో విభాగం అత్యధికంగా విలువ కోల్పోయింది. నిఫ్టీ బ్యాంక్‌, ఫైన్సాన్స్‌ సర్వీస్‌, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేట్‌ బ్యాంక్‌ సూచీలు కూడా నష్టాల బాట పట్టాయి. రూపాయి ఆరునెలల అత్యల్పం వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూ.71.23 వ‌ద్ద కొన‌సాగుతోంది.

నిఫ్టీలో నేడు లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు …

1308.jpg

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly