స్వ‌ల్ప లాభాలే కానీ.. కొత్త రికార్డు!

దేశీయ సూచీలు నేడు లాభాల‌తో ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్ 41,950 పైకి చేరింది

స్వ‌ల్ప లాభాలే కానీ.. కొత్త రికార్డు!

దేశీయ మార్కెట్లు మంగ‌ళవారం మ‌రో కొత్త రికార్డుకు చేరుకున్నాయి. ప్రారంభంలో న‌ష్టాల‌ను నమోదు చేసిన మార్కెట్లు కాసేప‌టికే తిరిగి పుంజుకున్నాయి. అప్ప‌టి నుంచి చివ‌రివ‌ర‌కు సానుకూల‌త‌నే క‌న‌బ‌రిచిన సూచీలు స్వ‌ల్పంగానే లాభ‌ప‌డిన‌ప్ప‌టికీ కొత్త రికార్డుల‌ను న‌మోదుచేశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్ 92.94 పాయింట్ల లాభంంతో 41,952.63 వ‌ద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీ 32.75 పాయింట్ల లాభంతో 12,362.30 వ‌ద్ద ముగిసింది.

డిసెంబ‌ర్ రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం పెర‌గ‌డంతో ప్రారంభంలో సూచీలు న‌ష్టపోయాయి. అయితే అంత‌ర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు మార్కెట్ల‌ను బ‌ల‌ప‌రిచాయి. డిసెంబ‌ర్ నెల‌ టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం ఏడు నెల‌ల గ‌రిష్ఠానికి చేరి 2.59 శాతంగా న‌మోదు కావ‌డంతో సూచీలు స్వ‌ల్ప లాభాల‌కే ప‌రిమితం అయ్యాయి. కంపెనీల త్రైమాసిక ఫ‌లితాల‌పై మ‌దుర్లు దృష్టి వ‌హించారు. ఆసియా మార్కెట్లు నేడు లాభాల‌తో ముగిశాయి. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.70.87 వ‌ద్ద కొన‌సాగుతోంది.

నిఫ్టీలో నేడు లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…

1401.jpg

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly