ఫ్లాట్‌గా ముగిసిన ట్రేడింగ్‌

దేశీయ సూచీల జోరుకు నేడు బ్రేక్ ప‌డింది. నేడు మార్కెట్లు అత్య‌ల్ప లాభాల‌తో ముగిశాయి.

ఫ్లాట్‌గా ముగిసిన ట్రేడింగ్‌

దేశీయ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. భారీ లాభాల‌తో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు చివ‌ర‌కు అత్య‌ల్ప లాభాల‌తో ట్రేడింగ్ ముగించాయి. చివ‌రికి సెన్సెక్స్ 2.72 పాయింట్ల లాభంతో 37,754.89 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ అత్య‌ల్పంగా 1.55 పాయింట్ల లాభంతో 11,343.25 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

వ‌రుస‌గా మూడు రోజులు భారీ లాభాల‌ను న‌మోదు చేసిన మార్కెట్లు నేడు స్త‌బ్దుగా ముగిశాయి. ఫిబ్ర‌వ‌రిలో టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం పెర‌గ‌డం కూడా కొంత నిరాశ‌ప‌రిచింది. వ‌రుస లాభాల‌తో మ‌దుప‌ర్లు లాభాల స్వీక‌ర‌ణ‌కు మొగ్గుచూప‌డంతో నేడు సూచీలు స్థిరంగా ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.69.35 వ‌ద్ద కొన‌సాగుతోంది.

నేడు నిఫ్ట‌లో లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…

1403.jpg

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly