సెన్సెక్స్ @ 38,000, నిఫ్టీ @ 11,400

నేడు బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ మళ్లీ 38వేల మార్క్‌ను దాటగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 11,400 పైన ట్రేడ్‌ అయ్యింది.

సెన్సెక్స్ @ 38,000, నిఫ్టీ @ 11,400

దేశీయ మార్కెట్లు శుక్ర‌వారం భారీ లాభాల‌తో ముగిశాయి. సెన్సెక్స్ తిరిగి 38 వేల‌కు చేర‌గా, నిఫ్టీ 11,400 పైకి చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడులు పెరగడం, రూపాయి బలోపేతం, దేశీయంగా కొనుగోళ్లు వెల్లువెత్తడం… ఇవన్నీ మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపర్చాయి. దీంతో నేటి ట్రేడింగ్‌లో సూచీలు లాభాల జోరు కనబర్చాయి. చివ‌రికి సెన్సెక్స్‌ 269.43 పాయింట్ల లాభంతో 38,024.32 వద్ద, నిఫ్టీ 83.60 పాయింట్ల లాభంతో 11,426.85 వద్ద స్థిరపడ్డాయి.

నేడు ఉద‌యం 240 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌ కాసేపటికే మరింత లాభ‌ప‌డి ప్రతిష్ఠాత్మక 38వేల మైలురాయిని దాటింది. ఒక దశలో 420 పాయింట్లు లాభపడి 38,175 గరిష్ఠ స్థాయిని తాకింది. ఐటీ, బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌ షేర్ల కొనుగోళ్లు పెర‌గ‌డం మార్కెట్ల‌కు క‌లిసొచ్చింది. అయితే చివరి గంటల్లో కొన్ని రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలతో సూచీలు కొంత లాభాల‌ను కోల్పోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.16 గా కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి.

నిఫ్టీలో నేడు లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు …

1503.jpg

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly