లాభాల‌తో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

వ‌రుస‌గా మూడో రోజు దేశీయ సూచీలు లాభాల‌తో ముగిశాయి.

లాభాల‌తో  ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు ఈ వారం లాభాల‌తో ట్రేడింగ్ మొద‌లుపెట్టాయి. ఉద‌యం సానుకూలంగా ప్రారంభ‌మైన మార్కెట్లు చివ‌రి వ‌ర‌కు అదే ధోర‌ణిని క‌న‌బ‌రిచాయి. జాతీయ, అంత‌ర్జాతీయ సానుకూల అంశాలు క‌లిసొచ్చాయి. చివ‌రికి సెన్సెక్స్ 138.73 పాయింట్ల లాభంతో 38,905.84 వద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీ 46.90 పాయింట్ల లాభంతో 11,690.35 వద్ద ముగిసింది.

ఫిబ్ర‌వ‌రిలో పారిశ్రామికాభివృద్ధి నెమ్మ‌దించ‌డం, మార్చి నెల‌లో రిటైల్, టోకు ద్ర‌వ్యోల్బ‌ణం పెర‌గ‌డం ప్ర‌తికూల అంశాలే అయిన‌ప్ప‌టికీ మార్కెట్లు లాభాల‌ను నిల‌దొక్కుకున్నాయి. అయితే దేశీయ మార్కెట్ల‌లోకి విదేశీ పెట్టుబ‌డులు పెర‌గ‌డం, ఆసియా మార్కెట్లు నేడు లాభ‌ప‌డటం వంటి అంశాలు మార్కెట్ల లాభాల‌కు కార‌ణ‌మ‌య్యాయి. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.70.30 వ‌ద్ద కొన‌సాగుతోంది.

నిఫ్టీలో నేడు లాభ‌, న‌ష్టాలతో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…
1504.jpg

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly