వారాంతంలో లాభాల‌తో ముగింపు

దేశీయ మార్కెట్లు శుక్ర‌వారం లాభాల‌తో ముగిశాయి. సెన్సెక్స్ 39,200 పైకి చేరింది.

వారాంతంలో  లాభాల‌తో ముగింపు

వ‌రుస‌గా ఆరో రోజు మార్కెట్లు లాభాల‌ను న‌మోదుచేశాయి. అంత‌ర్జాతాయ మార్కెట్ల సంకేతాలు ప్ర‌తికూలంగా ఉన్న‌ప్ప‌టికీ దేశీయ మార్కెట్ల‌పై ప్ర‌భావం చూప‌లేదు. చివ‌రికి సెన్సెక్స్ 246.32 పాయింట్ల లాభంతో 39,298.38 వ‌ద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీ 75.50 పాయింట్ల లాభంతో 11,661.85 వ‌ద్ద ముగిసింది.

ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 100 పాయింట్లు లాభ‌ప‌డ‌గా, నిఫ్టీ 11,600 పైన న‌మోదైంది. విదేశీ పెట్టుబ‌డులు పెర‌గ‌డం, మార్కెట్ల‌కుక‌లిసొచ్చింది. పెట్టుబ‌డిదారుల‌కు భారత్ కంటే అత్యుత్త‌మ దేశం ఏమి లేద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామ‌న్ వ్యాఖ్య‌లు మార్కెట్ల‌కు బ‌లాన్ని చేకూర్చాయి. అమెరికా, చైనా త‌ర్వాత అంకుర సంస్థ‌ల‌కు భార‌త్ త‌ర్వాత స్థానంలో నిలిచింద‌ని ప్రైవేట్ నివేదిక తెలిపింది. కార్పొరేట్ ప‌న్ను త‌గ్గింపు దేశంలో మ‌రిన్ని పెట్టుబ‌డుల‌కు ఊతం ఇస్తుంద‌ని తెల‌ప‌డంలో సూచీలు లాభ‌ప‌డ్డాయి. ఆసియా మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.71.14 వ‌ద్ద న‌మోద‌వుతోంది.

నిఫ్టీలో నేడు లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు …

1810.jpg

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly