మార్కెట్ల‌లో కొన‌సాగిన న‌ష్టాలు

స్టాక్ మార్కెట్లు నేడు న‌ష్టాల‌తో ట్రేడింగ్ ముగించాయి. సూచీలు మ‌రింత దిగువ‌కు చేరాయి.

మార్కెట్ల‌లో కొన‌సాగిన న‌ష్టాలు

దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ప్రారంభంలో లాభ‌ప‌డిన మార్కెట్లు మ‌ధ్యాహ్నం త‌ర్వాత న‌ష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా ఐటీ, టెక్ రంగాల్లో షేర్లు క్షీణించ‌డంతో ప్ర‌తికూల‌త ఏర్ప‌డింది. చివ‌రికి సెన్సెక్స్‌ 146 పాయింట్లు కుంగి 35,353 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు పడిపోయి 10,605 వద్ద ముగిశాయి.

ప్ర‌భుత్వానికి ఆర్‌బీఐ రూ.28 వేల కోట్ల మ‌ధ్యంత‌ర డివిడెండు ప్ర‌క‌టించ‌డంతో ఉదయం సానుకూలంగా ట్రేడ‌య్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు లాభ‌ప‌డ‌గా, నిఫ్టీ 10,650 పైన న‌మోదైంది. అయితే అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డం, ఐటీ రంగాల షేర్లు క్షీణించ‌డంతో తిరిగి న‌ష్టాల్లోకి జారుకున్నాయి. చివ‌రి వ‌ర‌కు కోలుకోలేదు. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు భారీగా పతనమయ్యాయి. నిఫ్టీ ఐటీ సూచీ 2శాతం నష్టపోయింది. ముఖ్యంగా టీసీఎస్‌, విప్రో షేర్లు పడిపోవడం దీనికి కారణమైంది. ఫార్మా సూచీ కూడా నష్టాల్లో ముగిసింది. ఆసియా మార్కెట్లు మిశ్ర‌మంగా ముగిశాయి.

నిఫ్టీలో నేడు లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…
1902.jpg

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly