వారాంతంలో లాభాల‌తో ముగిసిన మార్కెట్లు

సెన్సెక్స్ 282 పాయింట్లు లాభ‌ప‌డ‌గా, నిఫ్టీ 12,850 పైన ముగిసింది

వారాంతంలో  లాభాల‌తో ముగిసిన     మార్కెట్లు

దేశీయ మార్కెట్లు వారాంతంలో లాభాల‌తో ముగిశాయి. సెన్సెక్స్ 282.29 పాయింట్ల లాభంతో 43,882.25 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ 87.35 పాయింట్ల లాభంతో 12,859.05 వ‌ద్ద స్థిర‌ప‌డింది. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.74.16 వ‌ద్ద ముగిసింది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్ షేర్లు లాభ‌ప‌డ్డాయి.

బ్యాంకింగ్, ఫైనాన్షియ‌ల్, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాల షేర్లు పెర‌గ‌డంతో మార్కెట్లు లాభ‌ప‌డ్డాయి. నిఫ్టీలో నేడు బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్‌, టైటాన్ కంపెనీ, గెయిల్, బ‌జాజ్ ఫైనాన్స్, కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ షేర్లు రాణించాయి. మ‌రోవైపు రిల‌య‌న్స్‌, అదానీ, ఇండ‌స్ఇండ్ బ్యాంక్, స‌న్ ఫార్మా, డాక్ట‌ర్ రెడ్డీస్ షేర్లు న‌ష్ట‌పోయాయి.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly