న‌ష్టాలతో ముగిసిన మార్కెట్లు

శుక్ర‌వారం స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. సూచీలు కీల‌క స్థాయుల‌ను కోల్పోయాయి.

న‌ష్టాలతో ముగిసిన మార్కెట్లు

వ‌రుస లాభాలకు బ్రేక్ ప‌డింది. దేశీయ సూచీలు వారాంతంలో న‌ష్టాల‌తో ముగిశాయి. మదుప‌ర్లు లాభాల‌కు స్వీక‌ర‌ణ‌కు మొగ్గుచూపడంతో అమ్మ‌కాలు పెరిగాయి. దీంతో మార్కెట్ల‌కు నేడు న‌ష్టాలు త‌ప్ప‌లేదు. చివ‌రికి సెన్సెక్స్ 222.14 పాయింట్లు నష్టపోయి 38,164.61 వద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీ 64 పాయింట్ల నష్టంతో 11,456.90 వద్ద ముగిసింది.

నేడ ఉద‌యం మార్కెట్లు సానుకూలంగానే ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ 38,500 , నిఫ్టీ 11,500 పైన న‌మోద‌య్యాయి. అయితే ఆ త‌ర్వాత నెమ్మ‌దించిన సూచీలు కీలక షేర్ల అమ్మ‌కాలు పెర‌గ‌డంతో న‌ష్టాల్లోకి జారుకున్నాయి. ఫిచ్ రేటింగ్స్ 2020 ఆర్థిక సంవ‌త్స‌రానికి భారత వృద్ధి రేటు అంచ‌నాను 6.8 శాతానికి త‌గ్గించడం కొంత నిరాశ‌ప‌రిచింది. భారీ కంపెనీల షేర్లు నష్టపోవడం నేటి మార్కెట్ల న‌ష్టాల‌కు కార‌ణ‌మ‌య్యాయి. ఆసియా మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.68.96 వ‌ద్ద కొన‌సాగుతోంది.

నిఫ్టీలో నేడు లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…
2203.jpg

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly