వారాంతంలో లాభ‌ప‌డిన సూచీలు

శుక్ర‌వారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల‌ను న‌మోదుచేశాయి

వారాంతంలో లాభ‌ప‌డిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో లాభాల‌తో ముగిశాయి. ప్రారంభంలో కాస్త త‌డ‌బ‌డిన సూచీలు కాసేప‌టికే తిరిగి పుంజుకున్నాయి. ఆద్యంతం లాభాల‌తో కొన‌సాగిన సూచీలు చివ‌రికి సెన్సెక్స్ 226.79 పాయింట్ల లాభంతో 41,613.19 వ‌ద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీ 67.90 పాయింట్ల లాభంతో 12,248.25 వ‌ద్ద ముగిసింది.

నేడు సెన్సెక్స్‌ 65 పాయింట్ల న‌ష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది. ఆ త‌ర్వాత కాసేప‌టికే లాభాల బాట ప‌ట్టిన సూచీ చివ‌రివ‌ర‌కు అదేజోరును కొన‌సాగించింది. చివ‌ర‌కు 227 పాయింట్లు లాభ‌ప‌డింది. ఇటు నిఫ్టీ కూడా 12,250 వ‌ద్ద‌కు చేరింది. ఐటీ మిన‌హాయించి లోహ‌, ఆటో, ఇన్‌ఫ్రా, బ్యాంకింగ్ రంగాల షేర్ల కొనుగోళ్లు పెర‌గ‌డంతో మార్కెట్లు లాభ‌ప‌డ్డాయి. ఆసియా మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.71.30 వ‌ద్ద కొన‌సాగుతోంది.

నేడు నిఫ్టీలో లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…

2401.jpg

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly