40 వేల దిగువ‌కు ప‌డిపోయిన సెన్సెక్స్‌

సెన్సెక్స్ ఏకంగా 40 వేల దిగువ‌కు చేర‌గా, నిఫ్టీ 11,700 కంటే త‌క్కువ‌కు ప‌డిపోయింది

40 వేల దిగువ‌కు ప‌డిపోయిన సెన్సెక్స్‌

దేశీయ మార్కెట్లు బుధ‌వారం భారీ న‌ష్టాల‌తో ముగిశాయి. సెన్సెక్స్ 392.24 పాయింట్ల న‌ష్టంతో 39,888.96 వ‌ద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీ 119.40 పాయింట్ల న‌ష్టంతో 11,678.50 వ‌ద్ద ముగిసింది. అంత‌ర్జాతీయ మార్కెట్ల న‌ష్టాలు దేశీయ మార్కెట్ల‌పై ప్ర‌భావం చూపాయి. క‌రోనా వైర‌స్ భ‌యాల‌తో పాటు దేశీయంగా మార్కెట్ల‌కు క‌లిసొచ్చే అంశాలు ఏమి లేక‌పోవ‌డంతో మ‌దుప‌ర్లు అమ్మ‌కాల‌కు మొగ్గుచూపారు. దీంతో సూచీలు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. సెన్సెక్స్ ఏకంగా 40 వేల దిగువ‌కు చేర‌గా, నిఫ్టీ 11,700 కంటే త‌క్కువ‌కు ప‌డిపోయింది. ఆసియా మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.71.65 వ‌ద్ద కొన‌సాగుతోంది. నిఫ్టీలో యస్‌ బ్యాంకు, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఎస్బీఐ, బ్రిటానియా, హెచ్‌సీఎల్‌ షేర్లు లాభాల్లో పయనించగా… గెయిల్‌, సన్‌ఫార్మా, టాటా మోటర్స్‌, మారుతీ సుజుకీ, హిందాల్కో షేర్లు నష్టాల్లో ముగిశాయి.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly