ఐదో రోజూ న‌ష్టాల‌తో..!

స్టాక్ మార్కెట్లు గురువారం న‌ష్టాల‌తో ముగిశాయి. నిఫ్టీ ఏకంగా 11,650 దిగువ‌కు చేరింది

ఐదో రోజూ న‌ష్టాల‌తో..!

భారీ న‌ష్టాల నుంచి కొంత కోలుకున్న‌ప్ప‌టికీ దేశీయ మార్కెట్లు నేడూ న‌ష్టాల‌తో ముగిశాయి. వ‌రుస‌గా ఐదో రోజు సూచీలు న‌ష్టాలు త‌ప్ప‌లేదు. క‌రోనా భ‌యాలు ఇంకా అంత‌ర్జాతీయ మార్కెట్ల‌ను వెంటాడుతుండ‌టంతో దేశీయ మార్కెట్ల‌పై కూడా ఆ ప్ర‌భావం క‌న‌బ‌డుతోంది. దేశీయ మార్కెట్లు మ‌రింత న‌ష్ట‌పోతున్నాయి. నేడు సెన్సెక్స్ 134 పాయింట్ల న‌ష్టంతో 39,754 వ‌ద్ద, నిఫ్టీ 39 పాయింట్ల న‌ష్టంతో 11,639 వ‌ద్ద ప్రారంభ‌మ‌య్యాయి. ఒక ద‌శ‌లో సెన్సెక్స్ 450 పాయింట్ల వ‌ర‌కు కోల్పోయింది. అయితే చివ‌ర‌కు భారీ న‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డిన మార్కెట్లు ఎఫ్ అండ్ ఓ సిరీస్ ముగింపు నేప‌థ్యంలో మ‌దుప‌ర్లు అప్ర‌మ‌త్త‌త వ‌హించ‌డంతో ప్ర‌తికూలంగానే ట్రేడింగ్ ముగిసింది. చివ‌ర‌కు సెన్సెక్స్ 143.30 పాయింట్ల న‌ష్టంతో 39,745.66 వద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీ 45.20 పాయింట్ల న‌ష్టంతో 11,633.30 వ‌ద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.71.60 వ‌ద్ద కొన‌సాగుతోంది.

నేడు నిఫ్టీలో లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…

2702.jpg

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly