స్వ‌ల్ప లాభాల‌తో ముగింపు

దేశీయ సూచీలు బుధ‌వారం స్వ‌ల్ప లాభాల‌తో ముగిశాయి. నిఫ్టీ తిరిగి 11,100 స్థాయిని నిల‌బెట్టుకుంది.

స్వ‌ల్ప లాభాల‌తో ముగింపు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం ఎట్టకేలకు స్వల్ప లాభాలతో ముగిశాయి. మ‌ధ్యాహ్నం వ‌ర‌కు న‌ష్టాల‌నే న‌మోదు చేసిన మార్కెట్లు చివ‌రికి కొంత కుదుట‌ప‌డ్డాయి. సెన్సెక్స్ 83.88 పాయింట్లు లాభపడి 37,481.12 వద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీ 32.60 పాయింట్ల లాభంతో 11,118 పాయింట్లు వద్ద ముగిసింది.

వ‌రుస న‌ష్టాల నుంచి సూచీలు నేడు స్వ‌ల్పంగా కోలుకున్నాయి. ప్రారంభంలో మ‌దుప‌ర్లు అప్ర‌మ‌త్త‌తో న‌ష్ట‌పోయిన సూచీలు చివ‌రికి కాస్త నిల‌దొక్కుకున్నాయి. 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో విదేశీ ప్ర‌త్య‌క్ష‌ పెట్టుబ‌డులు 64.37 బిలియ‌న్ డాల‌ర్లుగా న‌మోద‌య్యాయ‌ని నివేదిక తెల‌ప‌డంతో క‌లిసొచ్చింది. గ‌త అయిదేళ్ల‌లో దేశంలోకి 286 బిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి. ఆసియా మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.68.78 వ‌ద్ద కొన‌సాగుతోంది.

నిఫ్టీలో నేడు లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…

3107.jpg

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly