2018 చివ‌రి రోజు ఫ్లాట్‌గా ముగింపు

2018 సంవ‌త్స‌రంలో చివ‌రి రోజు మార్కెట్లు స్త‌బ్దుగా ట్రేడింగ్ ముగించాయి.

2018 చివ‌రి రోజు ఫ్లాట్‌గా ముగింపు

ఈ ఏడాది చివరి రోజును దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఈ ఉదయం స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే కాసేప‌టికే కీలక రంగాల షేర్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా సూచీల ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. చివ‌రికి సెన్సెక్స్‌ 8.39 పాయింట్ల న‌ష్టంతో 36,068.33 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ 2.65 పాయింట్ల లాభంతో 10,862.55 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

ఈరోజు మార్కెట్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ 150 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అయ్యింది. నిఫ్టీ కూడా 10,900 పాయింట్ల స్థాయిని దాటి కొనసాగింది. అయితే సూచీల జోరు ఎంతోసేపు నిలువలేదు. చాలా సేపు ఒడుదొడుకులకు లోనైన సూచీలు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ స్వ‌ల్పంగా 8 పాయింట్లు న‌ష్ట‌పోగా, నిఫ్టీ 10,900 మార్క్‌ను కోల్పోయింది. 3 పాయింట్ల లాభంతో 10,862 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి.

నిఫ్టీలో నేడు లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు
3112.jpg

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly