టాప్ 5 క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీలు

ఆర్థికంగా అనిశ్చితికి గురిచేసే తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొనేందుకు క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీ స‌రైన ఎంపిక‌.

టాప్ 5 క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీలు

భారతీయ ఆరోగ్య గణాంకాల ప్రకారం, ప్రతి సంవత్సరం 3శాతం మంది ప్రజలు దారిద్య్ర రేఖ దిగువ‌కు చేరుకుంటున్నారు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం పెరుగుతున్న వైద్య ఖ‌ర్చులు. వైద్య చికిత్స‌ల కోసం అయ్యే ఖ‌ర్చుల కార‌ణంగా ప్ర‌తీ సంవ‌త్స‌రం మ‌రో 3శాతం మంది వారు ప్ర‌స్తుతం ఉన్న స్థితి నుంచి కిందికి స్థాయికి ప‌డిపోతున్నారు. ఉన్న‌త‌స్థాయిలో ఉన్న‌వారు మ‌ధ్య త‌ర‌గ‌తికి, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు కింది స్థాయికి వ‌స్తున్నారు. ఉప‌శ‌మ‌నం ల‌భించ‌ని వ్యాధులు సంభ‌వించిన‌ప్పుడు వాటిని ఎదుర్కునేందుకు త‌గిన మార్గాన్ని ఏర్పాటు చేసుకోక‌పోతే, ఇది వారి కుటుంబాల‌పై ఆర్థికంగా తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంది. తీవ్ర అనారోగ్యాల‌కు గుర‌య్యే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. మ‌న స‌మాజంలో పెరుగుతున్న ఆధునిక ధోరిణి, జీవిన‌శైలిలో మార్పులు కార‌ణంగా కొంత వ‌ర‌కు మంచి జ‌రుగుతుంది. కానీ మంచి కంటే చెడు (తీసుకునే ఆహారం, ఎక్కువ‌గా తినడం, ఆహారం తీసుకునే వేళ‌లు, మ‌ధ్య‌పానం వంటి) ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. భార‌త‌దేశంలో స్థూల‌కాయం(ఒబేసిటి)తో బాధ‌ప‌డే వారి సంఖ్య అధిక మ‌వుతుంది. దీని కార‌ణంగా డ‌యాబెటిస్‌, స్ట్రోక్‌, గుండెకు సంబంధించిన వ్యాధులు, వ‌స్తున్నాయి. మ‌న దేశంలో ప్ర‌తీ సంవ‌త్స‌రం 7 శాతం మంది శ్వాస సంబంధిత వ్యాధుల‌తో మ‌ర‌ణిస్తున్నారు. ఇటువంటి తీవ్ర అనారోగ్యాల‌కు గురికాకుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఒక‌వేళ గురైతే ఎదుర్కొనేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. ఆర్థికంగా అనిశ్చితికి గురిచేసే ఇటువంటి తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొనేందుకు క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీ స‌రైన ఎంపిక‌.

క్రిటిక‌ల్ ఇల్‌నెస్ క‌వ‌ర్ అంటే ఏమిటి?

ఒక వ్య‌క్తి బీమా సంస్థ నుంచి క్రిటిక‌ల్ ఇల్‌నెన్స్ పాల‌సీ తీసుకున్న‌ప్పుడు, బీమా సంస్థ ఇచ్చిన వ్యాధుల జాబితాలోని ఏదైనా వ్యాధికి బీమా చేసిన వ్య‌క్తి గురైన‌ట్లు నిర్ధార‌ణ అయితే బీమా సంస్థ పాల‌సీలో ఉన్న నిభంధ‌ల‌న‌కు అనుగుణంగా హామీ మొత్తాన్ని ఒకేమొత్తంగా గానీ, క్ర‌మ‌మైన ఆదాయంగా గానీ, శ‌స్త్ర చికిత్స‌ల పూర్తి వ్య‌యాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కి, గుండె సంబంధిత‌ బైపాస్ ఆప‌రేష‌న్ మొద‌లైన‌వి. పాల‌సీ క‌వ‌ర్ చేసే వ్యాధులు, క‌వ‌ర్ చేయ‌ని వ్యాధులను ప్ర‌తీ క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీలోనూ పేర్కొంటారు. గుండె జబ్బులు, క్యాన్సర్, స్ట్రోక్‌, కోమా వంటి ప్ర‌ధాన‌ అనారోగ్యాలను సాధారణంగా అన్ని క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీలు క‌వ‌ర్ చేస్తాయి. వీటి సంభావ్య‌త శాతం ఎక్కువ‌, వీటిక‌య్యే ఖ‌ర్చు కూడా ఎక్కువే. క్యాన్స‌ర్, కోమా వంటి కొన్ని అనారోగ్యాలు ఒకేసారి న‌యం కావు. కొన్ని అనారోగ్యాల‌కు జీవిత‌మంతా చికిత్స చేయించాల్సి ఉంటుంది. కొన్ని ఇత‌ర‌ క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీలు సంస్థ‌కు అనుగుణంగా మారుతూ ఉంటాయి.

కొన్ని అనారోగ్యాల‌ను ఏ పాల‌సీలు క‌వ‌ర్ చేయ‌క‌పోవ‌చ్చు. అందువ‌ల్ల పాల‌సీ కొనుగోలు చేసేముందు క‌వ‌ర్ చేసే, క‌వ‌ర్ చేయ‌ని అనారోగ్యాల జాబితాను, పాల‌సీ ష‌ర‌తులు, నిబంధ‌న‌ల‌ను పూర్తిగా చ‌దివి, అర్ధంచేసుకుని ఎక్కువ శాతం క్రిటిక‌ల్ ఇల్‌నెన్స్‌ను క‌వ‌ర్ చేసే పాల‌సీని కొనుగోలు చేయాలి.

క్రిటిక‌ల్ ఇల్‌నెస్ క‌వ‌ర్ ప్ర‌యోజ‌నాలు:

 1. ఆర్థిక భ‌ద్ర‌త - క్రిటిక‌ల్ ఇల్‌నెన్స్ మీ జీవితానికి మాత్ర‌మే కాకుండా మీ కుటుంబ స‌భ్యుల‌కు కూడా ఆర్థికంగా భ‌ద్ర‌త క‌ల్పిస్తుంది.
 2. 30కి పైగా అనారోగ్యాలు - కొన్ని సంస్థ‌లు అందించే పాల‌సీలు 30కిపైగా అనారోగ్యాల‌ను క‌వ‌ర్ చేస్తున్నాయి.
 3. కొనుగోలు చేసే ముందు ఎటువంటి అనారోగ్యాల‌ను, వ్యాధుల‌ను క‌వ‌ర్ చేస్తుందో తెలుసుకోవాలి.
 4. సెకెండ్ ఒపీనియ‌న్ - దాదాపు అన్ని బీమా సంస్థ‌లు రెండ‌వ సారి వైద్య నిపుణుని అభిప్రాయం కోర‌తాయి. దీని వ‌ల్ల నిర్ధారించిన వ్యాధి గురించి మెరుగైన స‌మీక్ష వ‌స్తుంది.
 5. 100 శాతం చెల్లింపులు - పాల‌సీ జాబితాలో ఉన్న తీవ్ర అనారోగ్యం ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయితే బీమా సంస్థ హామీ మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తుంది.
 6. ప‌న్ను ప్ర‌యోజ‌నం - ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961, సెక్ష‌న్ 80డీ ప్ర‌కారం అన్ని క్రిట‌క‌ల్ పాల‌సీలు ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.
 7. ఒక‌సారి క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీ తీసుకుంటే, మీ ఆర్థిక స్థితికి భ‌ద్రంగా ఉంటుందన్న ధీమాతో ప్ర‌శాంతంగా ఉండొచ్చు. ఒక‌వేళ మీరు తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌కు గురైతే డ‌బ్బు కోసం ప్ర‌య‌త్నించ‌కుండా మీ పూర్తి దృష్టిని చికిత్స‌పై ఉంచ‌వచ్చు.

5 ప్ర‌ధాన క్రిటిక‌ల్ ఇల్‌నెస్ క‌వ‌ర్లు:

మ‌న దేశంలో అందుబాటులో ఉన్న 5 ప్ర‌ధాన క్రిటిక‌ల్ ఇల్‌నెస్ క‌వర్లు-వాటి వివ‌రాలు:

critical.jpg

క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీని కొనుగోలు చేసే ముందు చూడ‌వ‌ల‌సిన 6 ముఖ్య విష‌యాలు:

 1. ప్రీమియం:
  మీరు చెల్లించే డ‌బ్బుకు త‌గిన విలువ‌ను, హామీ మొత్తాన్ని అందించ‌డంతో పాటు మీరు అనుకున్న‌ వ్యాధుల‌ను క‌వ‌ర్ చేసే పాల‌సీల‌ను ఎంపిక చేసుకుని వాటికి బీమా సంస్థ నిర్ణయించిన‌ ప్రీమియంల‌ను పోల్చి చూసుకోవాలి.

 2. హామీ మొత్తం:
  అధిక మొత్తం హామీ, పాల‌సీ కోనుగోలుకు ప్ర‌మాణికం కాదు. అనుకోకుండా వ‌చ్చే తీవ్ర‌మైన అనారోగ్యాల వ‌ల్ల ఆర్థిక జీవితం ప్ర‌భావితం కాకుండా ఉండేందుకు క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీని కొనుగోలు చేయాలి. అందువ‌ల్ల హామీ మొత్తం రూ.10 ల‌క్ష‌ల నుంచి రూ. 20 లక్ష‌లు ఉండేలా చేసుకుంటే స‌రిపోతుంది.

 3. వెయిటింగ్ పిరియ‌డ్‌:
  ముందుగా ఉండే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఆరోగ్య‌బీమాలో కొన్నాళ్ల‌పాటు వెయిటింగ్ పీరియ‌డ్ ఉంటుంది. అంటే ఈస‌మ‌యంలో పాల‌సీ తీసుకున్నాస‌రే బీమా వ‌ర్తించ‌దు. ఉదాహ‌ర‌ణ‌కు మీరు తీసుకున్న పాల‌సీ వెయిటింగ్ పీరియ‌డ్ 2 నెల‌లు అయితే ఈ 2 రెండు నెల‌లో మీరు ఏదైనా అనారోగ్యానికి గురైతే ఎటువంటి హామీ చెల్లించ‌రు. పాల‌సీ కొనుగోలు చేసిన నాటి నుంచి బీమా సంస్థ‌లు పాల‌సీ నియ‌మాల ప్ర‌కారం ఉన్న వెయిటింగ్ పిరియ‌డ్ త‌రువాత నిర్ధార‌ణ అయిన అనారోగ్యాల‌కు మాత్ర‌మే బీమా హామీ చెల్లిస్తాయి. అందువ‌ల్ల త‌క్కువ వెయిటింగ్ పిరియ‌డ్ ఉన్న పాల‌సీల‌నే కొనుగోలు చేయాలి. సాధార‌ణంగా చాలా బీమా సంస్థ‌లు 90 రోజులు(ముందుగా ఉన్న ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు త‌ప్ప‌) వెయిటింగ్ పిరియ‌డ్‌తో పాల‌సీల‌ను అందిస్తాయి. ముందుగా ఉన్న ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు సాధార‌ణంగా 48 నెల‌ల వెయిటింగ్ పిరియ‌డ్ ఉంటుంది.

 4. స‌ర్వైవ‌ల్‌ పిరియ‌డ్‌:
  వ్యాధి నిర్ధార‌ణ అయిన త‌రువాత పాల‌సీ క్లెయిమ్ చేసుకునేందుకు, పాల‌సీదారుడు కొంత కాలం జీవించి ఉండాలి. దీనినే సర్వైవ‌ల్ పిరియ‌డ్ అంటారు. పాల‌సీదారుడు మ‌నుగ‌డ స‌మ‌యాన్ని అధిగ‌మిస్తేనే హామీ మొత్తం చెల్లిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కి పాల‌సీ కొనుగోలు చేసిన వ్య‌క్తి గుండెపోటు వ‌చ్చిన త‌క్ష‌ణం మ‌ర‌ణిస్తే, అత‌నికి క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీ ఉన్న‌ప్ప‌టికీ అత‌ని కుటుంబం బీమా సంస్థ నుంచి ఎటువంటి క్లెయిమ్‌ను పొంద‌లేదు.స‌ర్వైవ‌ల్ పిరియ‌డ్ కాల‌వ్య‌వ‌ధి సంస్థ నుంచి సంస్థ‌కు వేరు వేరుగా ఉంటుంది. ఇది 14 రోజుల నుంచి 30 రోజులు ఉంటుంది. అందువ‌ల్ల త‌క్కువ స‌ర్వైవ‌ల్ పిరియ‌డ్ ఉన్న క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీని కొనుగోలు చేయాలి.

ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధుల బారిన ప‌డిన‌ప్పుడు, వైద్య ఖ‌ర్చుల నిమిత్తం ఆర్థిక ఇబ్బందులు ప‌డ‌కుండా స‌రైన స‌మ‌యానికి చికిత్స అందేలా చూడ‌టమే క్రిటిక‌ల్ ఇల్‌నెస్స్ పాల‌సీ ముఖ్య ప్ర‌యోజ‌నం. మ‌ర‌ణ ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డం కాదు. వ్య‌క్తి మ‌ర‌ణానంత‌రం కుటుంబానికి హామీ మొత్తం అందించాలంటే అందుకు ట‌ర్మ్ పాల‌సీల‌ను తీసుకోవాలి. అందుచేత క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీ ఉన్న‌ప్ప‌టీ, కుటుంబ స‌భ్యులకు ఆర్థిక ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు ట‌ర్మ్ పాల‌సీని కూడా తీసుకోవాలి.

 1. పాల‌సీ కవ‌ర్ చేయువ్యాధులు:
  క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీని ఎంచుకునేప్పుడు ఎక్కువ వ్యాధులు క‌వ‌ర్ చేసే పాల‌సీల‌ను ఎంచుకుంటే ప్రీమియం కూడా ఎక్కువ‌గానే చెల్లించాలి. అందువ‌ల్ల మీ జీవ‌న‌శైలి, అవ‌వాట్లు, వంశ‌పారంప‌ర్య కార‌ణాల వ‌ల్ల వ‌చ్చే (4ప్ర‌ధాన వ్యాధులు, 28-30 వ్యాధులు) ప్రామాణిక వ్యాధులు ఉండేట్లుగా జాబితాను ఎంచుకోవాలి.

 2. ప్ర‌వేశ వ‌య‌సు:
  పాల‌సీ కొనుగోలు చేసేముందే ప్ర‌వేశ‌వ‌య‌సు తెలుసుకోండి. సాధార‌ణంగా క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీల ప్ర‌వేశ వ‌య‌సు 18 నుంచి 64 సంవ‌త్స‌రాలు ఉంటుంది.

ఆరోగ్య బీమా ఉండ‌గా క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీని ఎందుకు తీసుకోవాలి?

ఆరోగ్య బీమా క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీలు రెండూ వేరు వేరని గుర్తించుకోవాలి.క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీ నిర్ధిష్ట వ్యాధుల‌ను మాత్ర‌మే క‌వ‌ర్ చేస్తాయి. సాధార‌ణ ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను క‌వ‌ర్ చేయ‌వు. ఇన్ పేషెంట్ ఆసుపత్రి ఖ‌ర్చులు, ఆసుప‌త్రిలో చేరేందుకు ముందు, త‌రువాత‌, రోజు వారి రోజు సంరక్షణ చికిత్సలు, అంబులెన్స్ ఖర్చులు, అవయవ దాత ఖర్చులు, మొదలైనవి సాధార‌ణ ఆరోగ్య బీమా క‌వ‌ర్ చేస్తుంది. పాల‌సీ ఒప్పందంలో ఉన్న వ్యాధుల‌ను మాత్ర‌మే క్రిటిక‌ల్ ఇల్‌నెస్ క‌వ‌ర్ చేస్తుంది. ప్ర‌స్తుతం ఉన్న జీవ‌న శైలిలో ఒక క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీని కొనుగోలు చేయ‌డం మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly