పెరిగిన ముడి చ‌మురు ఫ్యూచ‌ర్ల ధ‌ర‌లు

అంత‌ర్జాతీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ముడి చ‌మురు ఫ్యూచ‌ర్ల ధ‌ర‌లు దేశీయ మ‌ల్టీ క‌మోడిటీ ఎక్స్చేంజీలో పెరిగాయి.

బ‌ల‌హీన డాల‌ర్ ప్ర‌భావం, ఒపెక్ స‌భ్య దేశాలు ఉత్ప‌త్తి కోతను కొన‌సాగిస్తుండ‌టంతో దేశీయ మ‌ల్టీ క‌మోడిటీ ఎక్స్చేంజీలో ముడి చ‌మురు ఫ్యూచ‌ర్ల ధ‌ర‌లు పెరిగాయి. దీనితో దేశీయంగా మ‌దుప‌రులు,ట్రేడ‌ర్లు త‌మ పొజిష‌న్ల‌ను స‌వ‌రించుకోవ‌డంతో ఈ ఫ్యూచ‌ర్ల ధ‌ర‌లు క్ర‌మంగా పెరుగుతున్నాయి. అయితే అమెరికా చ‌మురు నిల్వ‌లు క్ర‌మంగా పెరుగుతుండ‌టంతో ఈ ధ‌ర‌లు కాస్త త‌గ్గే అవ‌కాశం ఉంది.

ఈ నేప‌థ్యంలో ఫిబ్ర‌వ‌రి నెల డెలివ‌రీ కాంట్రాక్టుల ధ‌ర 47 రూపాయ‌లు పెరిగి బ్యారెల్ చ‌మురు రూ.3632.00 గా న‌మోదైంది. గ‌త సెష‌న్ ముగింపులో ఈ ధ‌ర రూ.3,585.00 గా ఉంది. మొత్తం కాంట్రాక్ట్ ప‌రిమాణం 15168 లాట్లుగా ఉంది.

మార్చి నెల‌కి సంబంధించిన కాంట్రాక్ట్ 44 రూపాయ‌లు పెరిగి రూ.3,683.00 గా న‌మోదైంది. నిన్న‌టి సెష‌న్లో ఇది రూ.3,639.00 గా ఉంది. కాంట్రాక్ట్ ప‌రిమాణం 1308 లాట్లుగా ఉంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly