క్రూడ్ ఫ్యూచ‌ర్ల క్షీణ‌త

అంత‌ర్జాతీయంగా అనిశ్చిత ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో దేశీయ క‌మోడిటీ మార్కెట్ల‌లో క్రూడ్ ఫ్యూచ‌ర్ల ధ‌ర‌లు త‌గ్గాయి.

క్రూడ్ ఫ్యూచ‌ర్ల క్షీణ‌త

అంత‌ర్జాతీయ ప‌రిణ‌మాల నేప‌థ్యంలో ముడి చ‌మురు ఫ్యూచ‌ర్ల ధ‌రలు త‌గ్గాయి. అమెరికా షేల్ ఆయిల్ నిల్వ‌లు పెర‌గ‌డం, సిరియాపై దాడి నేప‌థ్యంలో మ‌ధ్య‌ప్రాచ్యంలో ఉద్రిక్త‌త‌లు త‌లెత్త‌డం మొద‌లైన‌వి ఇందుకు ప్ర‌ధాన కార‌ణాలుగా ఉన్నాయి. అయితే ఒపెక్ స‌హ ఇత‌ర ప్ర‌ధాన చ‌మురు ఉత్ప‌త్తి దేశాలు ఉత్ప‌త్తిలో కోత విధించ‌డంతో ధ‌ర‌ల ప‌త‌నం కొంత వ‌ర‌కు త‌గ్గింది. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో మ‌దుప‌రులు, స్పెక్యులేట‌ర్లు పొజిష‌న్ల‌ను స‌వ‌రించుకోవ‌డంతో దేశీయ మ‌ల్టీ క‌మోడిటీ ఎక్స్చేంజీలో ముడి చ‌మురు ఫ్యూచ‌ర్ల ధ‌ర‌లు త‌గ్గాయి.

ఎమ్‌సీఎక్స్‌లో వివిధ కాంట్రాక్ట్‌ల‌ను ప‌రిశీలిస్తే ఏప్రిల్ డెలివ‌రీ 11 రూపాయ‌లు త‌గ్గి ప్ర‌స్తుతం బ్యారెల్‌కు రూ.3413 వ‌ద్ద ట్రేడింగ్ కొన‌సాగుతోంది. గ‌త సెష‌న్ లో ఈ ధ‌ర రూ.3424 గా ఉంది. మొత్తం కాంట్రాక్ట్ ప‌రిమాణం 19074 లాట్లుగా ఉంది.

మే డెలివ‌రీ కాంట్రాక్ట్ సైతం 11 రూపాయ‌లు తగ్గి ప్ర‌స్తుతం రూ.3449 వ‌ద్ద ట్రేడింగ్ కొన‌సాగుతోంది. నిన్న‌టి ముగింపు ధ‌ర రూ.3460 గా న‌మోదైంది. కాంట్రాక్ట్ ప‌రిమాణం 2096 లాట్లుగా ఉంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly