పుంజుకున్న క్రూడ్ ఫ్యూచ‌ర్ల ధ‌ర‌లు

ర‌ష్యా స‌హ ప్ర‌ధాన చ‌మురు ఉత్ప‌త్తి దేశాలు చ‌మురు ఉత్ప‌త్తి కోతపై నిర్ణ‌యం దిశగా అడుగులు వేస్తుండ‌టంతో క్రూడ్ ఫ్యూచ‌ర్ల ధ‌ర‌లు క్ర‌మంగా పెరుగుతున్నాయి.

అంత‌ర్జాతీయంగా సానుకూల ప‌రిస్థితులుండ‌టంతో ముడి చ‌మురు ఫ్యూచ‌ర్ల ధ‌ర‌లు మ‌ళ్లీ బ్యారెల్‌కు 50 డాల‌ర్ల స్థాయిని చేరుకున్నాయి. ఇత‌ర ప్ర‌దాన చ‌మురు దేశాల‌తో క‌ల‌సి చ‌మురు ఉత్పత్తి కోత‌పై ర‌ష్యా స‌మావేశం కానుండ‌టం ఇందుకు ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది. అమెరికా దేశ నిల్వ‌లు పెరిగాయ‌న్న కార‌ణాల‌తో ఆందోళ‌న‌కు గురైన మ‌దుప‌రులు,క్ర‌మంగా ఒపెక్‌&నాన్‌-ఒపెక్ దేశాల స‌మావేశాల‌పై దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. రోజుకు 12 ల‌క్ష‌ల బ్యారెళ్ల చొప్పున కోత విధించాల‌ని ఒపెక్ దేశాలు ఇప్ప‌టికే నిర్ణయం తీసుకున్న విష‌యం విదిత‌మే.

ఈ ప‌రిస్థితుల‌ల్లో జ‌న‌వ‌రి నెల బెంచ్‌మార్క్ క్రూడ్ ఫ్యూచ‌ర్ల ధ‌ర బ్యారెల్ చ‌మురుకు 1.07 డాల‌ర్లు పెరిగి నైమెక్స్ లో 50.84 గా న‌మోదైంది. ఫిబ్ర‌వ‌రి నెల బ్రెంట్ క్రూడ్ లండ‌న్ లో 0.89 డాల‌ర్లు పెరిగి 53.89 డాల‌ర్లుగా న‌మోదైంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly