స్వ‌ల్పంగా పెరిగిన చ‌మురు ఫ్యూచ‌ర్లు

అంత‌ర్జాతీయ ప‌రిణామాల నేప‌థ్యంలో దేశీయ క‌మోడిటీ మార్కెట్ల‌లో ముడి చ‌మురు ఫ్యూచ‌ర్ల ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి.

స్వ‌ల్పంగా పెరిగిన చ‌మురు ఫ్యూచ‌ర్లు

మ‌ల్టీ క‌మోడిటీ ఎక్స్చేంజీ(ఎమ్‌సీఎక్స్‌)లో ముడి చ‌మురు ఫ్యూచ‌ర్లు మెరుగ్గా ట్రేడ‌వుతున్నాయి. 2017 ప్రారంభం నుంచి 6 నెల‌ల పాటు ఉత్ప‌త్తిలో కోత‌ను విదిస్తామ‌న్న ఒపెక్ దేశాలు దానిని మ‌రో ఆరు నెల‌ల పాటు పొడిగించ‌డంతో అంత‌ర్జాతీయంగా ఈ క‌మోడిటీ ధ‌ర‌లు పెరుగుతున్నాయి. అయితే అమెరికా చ‌మురు నిల్వ‌ల గ‌ణాంకాలు మెరుగ్గా ఉండ‌టంతో ఈ లాభాల‌కు అడ్డుక‌ట్ట ప‌డింది.

దీనితో ఎమ్‌సీఎక్స్‌లో స్పెక్యులేట‌ర్లు, మ‌దుప‌రులు పొజిష‌న్ల‌ను స‌వ‌రించుకోవ‌డంతో క్రూడ్ ఫ్యూచ‌ర్ల ధ‌ర‌లు పెరిగాయి. ఎమ్‌సీఎక్స్‌లో మే డెలివ‌రీ కాంట్రాక్ట్ 26 రూపాయ‌లు పెరిగి బ్యారెల్‌కు రూ.3234 వ‌ద్ద ట్రేడింగ్ కొన‌సాగిస్తోంది. గ‌త సెష‌న్ ముగింపులో ఈ ధ‌ర రూ.3208 గా న‌మోదైంది. కాంట్రాక్ట్ ప‌రిమాణం 16970 లాట్లుగా న‌మోదైంది.

జూన్ డెలివ‌రీ సైతం 28 రూపాయ‌లు పెరిగి రూ.3272 గా న‌మోదైంది. నిన్న‌టి సెషన్లో ఇది రూ.3244 గా న‌మోదైంది. మొత్తం కాంట్రాక్ట్ ప‌రిమాణం 1106 లాట్లుగా ఉంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly