ఇంధ‌న సంబంధిత‌ క‌మోడిటీలు

ఇంధన ట్రేడింగ్ ఎలా జరుగుతుందో, ప్రభావితం చేసే అంశాలు ఏమిటో తెలుసుకుందాం..

ఇంధ‌న సంబంధిత‌ క‌మోడిటీలు

నిత్య జీవిత అవ‌స‌రాల‌లో ఇంధ‌నానికి ఉన్న ప్రాముఖ్య‌త మ‌రి దేనికీ లేదు. విద్యుద‌త్ప‌త్తి జ‌ర‌గాల‌న్నా, వాహ‌నాలు రోడ్డెక్కాల‌న్నా, ఇంట్లో పొయ్యి వెల‌గాల‌న్నా, ప‌రిశ్ర‌మ‌లు న‌డ‌వాల‌న్నా ఇంధ‌న‌మే ఆధారం. ఇంధ‌న క‌మోడిటీల‌లో ముడి చ‌మురు, స‌హ‌జ వాయువులు చాలా ముఖ్య‌మైన‌వి. ఇందులోనూ ముడి చ‌మురు ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. ముడి చ‌మురు ధ‌ర‌ల ప్ర‌భావం దేశాల ఆర్థిక‌ వ్య‌వ‌స్థ‌లనే శాసిస్తాయి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ముడి చ‌మురు

ముడి చ‌మురు భూమి లోప‌ల దొరికే హైడ్రోకార్బ‌న్ ల స‌మ్మేళ‌నం. ముడిచ‌మురు ద్వారా వ‌చ్చే ఉత్ప‌త్తుల‌ను వాహ‌నాల‌లో ఇంధ‌నంగా, ఉప ఉత్ప‌త్తుల‌ను కందెన‌లుగా, రోడ్ల నిర్మాణంలో, గ్లిజ‌రిన్‌ స‌బ్బుల పరిశ్ర‌మ‌ల‌లో వాడ‌తారు. ఇదికాకుండా అనేక ర‌కాల ప‌రిశ్ర‌మ‌ల‌లో ముడి చ‌మురును విరివిగా ఉప‌యోగిస్తారు.

ముడి చ‌మురు ఇంధ‌నం గాఢ‌త, వెలికి తీసిన ప్ర‌దేశం, శుద్ధి చేయ‌గ‌ల‌ సామ‌ర్ధ్యం, క‌మోడిటీ ప‌రిమాణాల‌ను బ‌ట్టి మూడు రకాలుగా వ‌ర్గీక‌రించారు.

 • 1.క్రూడ్ ఆయిల్
 • 2.క్రూడ్ ఆయిల్ మిని
 • 3.బ్రెంట్ క్రూడ్ ఆయిల్

కొల‌మానం

 • క్రూడ్ ఆయిల్ పరిమాణాన్ని బ్యారెల్‌లో కొలుస్తారు.
 • 1 బ్యారెల్ దాదాపు 159 లీట‌ర్ల‌కు స‌మానం. కాంట్రాక్టుల ప‌రిమాణాన్ని మెట్రిక్ ట‌న్నుల‌లో కొలుస్తారు.
 • 1 మెట్రిక్ ట‌న్ను 7.33 బ్యారెల్స్ కు స‌మానం.
 • కాంట్రాక్టు ప‌రిమాణం ప్రాంతాన్ని బ‌ట్టి మారుతూ ఉంటుంది.

కాంట్రాక్టుల ప్రారంభం:

ఏడాదిలో ప‌న్నెండు నెల‌ల కాంట్రాక్టులు అందుబాటులో ఉంటాయి. ప్ర‌తీ కాంట్రాక్టు కాల‌ప‌రిమితి 6 నెల‌లు. కాంట్రాక్టు క్యాలెండ‌ర్ లో నిర్దేశించిన తేది నుంచి కాంట్రాక్టులు మొద‌ల‌వుతాయి.

కాంట్రాక్టుల ముగింపు :

కాంట్రాక్టు క్యాలెండ‌ర్ లో నిర్దేశించిన విధంగా ముగింపు తేది ఉంటుంది.

ట్రేడింగ్ వివరాలు:

Screen Shot 2017-05-06 at 16.01.23.png

సెటిల్మెంట్ విధానం

 • సెటిల్మెంట్ రెండు ర‌కాలుగా ఉంటుంది
 • స‌రుకు డెలివ‌రి, క్యాష్ సెటిల్మెంట్ విధానం

ముడి చ‌మురును ప్ర‌భావితం చేసే అంశాలు :

 • పెట్రోలియం ఎగుమ‌తి చేసే దేశాల స‌మాఖ్య (ఒపెక్) నిర్ణ‌యించే ఉత్ప‌త్తి, ఎగుమ‌తి విధానాలు.
 • అమెరికా దేశానికి చెందిన‌ చ‌మురు నిల్వ‌ల స‌మాచారం.
 • ప్ర‌పంచ‌ దేశాల వినియోగం, డిమాండ్
 • అంత‌ర్జాతీయ క‌రెన్సీల‌లో ఒడిదొడుకులు లాంటి కొన్ని అంశాలు ముడిచ‌మురు ధ‌ర‌ల‌ను ప్ర‌భావం చేసే వాటిలో ముఖ్యమైన‌వి.

బ్రెంట్ క్రూడ్ ఆయిల్

కాంట్రాక్టుల ప్రారంభం:

ఏడాది లో ప‌న్నెండు నెల‌లు కాంట్రాక్టులు అందుబాటులో ఉంటాయి. ప్ర‌తీ కాంట్రాక్టు కాల‌ప‌రిమితి 3 నెల‌లు. కాంట్రాక్టు క్యాలెండ‌ర్లో నిర్దేశించిన తేదిల ప్ర‌కారం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కాంట్రాక్టులు ప్రారంభ‌మ‌వుతాయి.

కాంట్రాక్టుల ముగింపు:

సంబంధిత‌ కాంట్రాక్టు క్యాలెండ‌ర్ లో పేర్కొన్న విధంగా ముగింపు గ‌డువు ఉంటుంది.

ట్రేడింగ్ వివరాలు:

Screen Shot 2017-05-06 at 16.13.29.png

సెటిల్మెంట్ విధానం

 • సెటిల్మెంట్ రెండు ర‌కాలుగా ఉంటుంది
 • స‌రుకు డెలివ‌రి, క్యాష్ సెటిల్మెంట్ విధానం

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly