బ‌య‌ట తిన‌డం త‌గ్గించుకుంటే ఎంత పొదుపు చేయొచ్చో తెలుసా?

డ‌బ్బును 'తినేయ‌కుండా' కొంత పొదుపు చేయ‌డం అల‌వాటు చేసుకోవాలి

బ‌య‌ట తిన‌డం త‌గ్గించుకుంటే ఎంత పొదుపు చేయొచ్చో తెలుసా?

మీ స‌ర‌దాల‌ను, ఇష్టాల‌ను పూర్తిగా క‌ట్టడి చేయాల‌ని మా ఉద్దేశం కాదు కేవ‌లం బ‌య‌ట హోట‌ళ్ల‌లో, రెస్టారెంట్ల‌లో బోజ‌నం చేసేందుకు ఎంత ఖ‌ర్చు చేస్తున్నారు… అది త‌గ్గించుకుంటే ఎంత పొదుపు అవుతంద‌న్న విష‌యంపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఈ క‌థ‌నం…

ఈ రోజుల్లో బ‌య‌ట తిన‌డం అవ‌స‌రం కాదు, దానిని ఒక అల‌వాటుగా మార్చుకున్నారు. ఆ రోజుకి వంట చేసుకోవ‌డం కుద‌ర‌క‌పోయినా లేదా స‌మ‌యం లేన‌ప్పుడు బ‌య‌టం తిన‌డం స‌రే కానీ, రోజు ఈ విధంగా చేస్తే వ‌చ్చిన వేత‌నంలో స‌గం కంటే ఎక్కువ బోజ‌నానికే స‌రిపోతుంది. గ‌తంలో వారాంతాల్లో మాత్ర‌మే బోజ‌నం బ‌య‌ట చేసేవారు అయితే ఇప్పుడు యువ‌త ఉద్యోగాల రిత్యా మెట్రో న‌గ‌రాల‌కు మారుతుండ‌టం, కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావ‌డంతో ఈ విదంగా బోజ‌నం హోట‌ళ్ల‌లో, రెస్టారెంట్ల‌లో చేయ‌డం అన్న‌ది సాధార‌ణం అయిపోయింది. అవ‌స‌రం కంటే విలాసంగా భావిస్తున్నార‌ని చెప్ప‌వచ్చు. అయితే వారికి జీవ‌న‌శైలిని మార్చుకోమ‌ని చెప్పే హ‌క్కు ఎవ‌రికీ లేదు కానీ ఎంత డ‌బ్బు వృథా చేస్తున్నామో తెలుసుకొని పొదుపు చేసుకోవ‌డం అల‌వాటు చేసుకుంటే మంచిద‌ని నిపుణులు చెప్తున్నారు.

స్నేహితుల‌తో స‌ర‌దాగా గ‌డిపేందుకు బ‌యట‌కు వెళ్లడం, బోజ‌నం చేయ‌డం ఇప్పుడు ఉన్న యువ‌త‌కు అల‌వాటు. ఒక స‌ర్వే ప్ర‌కారం మిలీనియ‌ల్స్ నెల‌కు క‌నీన‌సం రూ.2,500 తిండికోసం ఖ‌ర్చు చేస్తున్నారు. జ‌న‌వ‌రి నుంచి మార్చి 2018 లో 10 న‌గ‌రాల్లో చేసిన‌ స‌ర్వే నివేదిక ప్ర‌కారం దీనిని వెల్ల‌డించింది. మొబైల్‌లో బోజనం డెలివ‌రీ యాప్‌ల ద్వారా ఆర్డ‌ర్ చేసుకోవ‌డం అల‌వాటుగా మారిపోయింది.

బ‌య‌ట బోజ‌నం చేయ‌డం డ‌బ్బు వృథా చేయ‌డ‌మే కాకుండా పెట్టుబ‌డులు చేసే అవ‌కాశాన్ని కూడా త‌గ్గిస్తుంది. త‌మ స‌ల‌హాలు తీసుకుంటున్న వారిలో 20 శాతం మంది మిలీనియ‌ల్స్ ఉన్నారు. వారు 30 శాతం కంటే అధికంగా త‌మ వేత‌నం నుంచి నెల‌కు బోజ‌నం కోసం ఖ‌ర్చు పెడుతున్నారు. దానిని 4-5 శాతానికి త‌గ్గించుకోవాలి. భ‌విష్య‌త్తులో అవ‌స‌రాలు చాలా ఉంటాయ‌ని తిండికోసం ఖ‌ర్చు పెట్ట‌డం ఒక్క‌టే విలాసం కాద‌నే విష‌యాన్ని గుర్తించాల‌ని ఆర్థిక నిపుణ‌లు చెప్తున్నారు.

కొత్త‌గా ఉద్యోగంలో చేరిన‌వారు హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌లో బోజ‌నం చేయడం లేదా ఆర్డ‌ర్ చేసుకోవ‌డం, ఆన్‌లైన్ షాపింగ్, స్ర్టీమింగ్ స‌ర్వీసెస్ కోసం, సినిమాలు షికార్లు వంటి స‌ర‌దాల కోసం వేత‌నం నుంచి 60 శాతానికి పైగా ఖ‌ర్చుచేస్తుంటారు. కేవ‌లం 15 శాతం లేదా అంత‌కంటే త‌క్కువ పొదుపు చేస్తున్నారు. ప్రారంభంలో ఎలా ఉన్నా ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా ఖ‌ర్చులు త‌గ్గించి పొదుపు అల‌వాటు చేసుకోవాలి. నెల‌కు క‌నీసం రూ.10 వేలు పొదుపు చేస్తూ ప్ర‌తి సంవ‌త్స‌రం ప‌ది శాతం పెంచుకుంటూ పోతే, 12 శాతం రాబ‌డి అంచ‌నాతో 25 సంవ‌త్స‌రాల త‌ర్వాత అవి రూ.3.5 కోట్ల‌కు చేర‌తాయ‌న్న విష‌యం గుర్తుంచుకోవాలి.

విలాస‌వంతంగా జీవించాల‌నుకోవ‌డం త‌ప్పు కాన‌ప్ప‌టికీ ఇత‌ర అవ‌స‌రాల‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడు డ‌బ్బు లేకుండా ఖ‌ర్చు చేసుకోవ‌డం మంచి విష‌యం కాద‌నేచెప్పుకోవాలి. పెట్టుబ‌డుల‌ను ప్రారంభించి దానికి అనుగుణంగా ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకుంటూ పోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly