డిజిట‌ల్ చెల్లింపుల్లో డెబిట్ కార్డుల‌దే హ‌వా

ఈ ఏడాది ఏప్రిల్ నెల‌లో డెబిట్ కార్డు లావాదేవీలు రికార్డు స్థాయిలో 1.21 బిలియ‌న్ల‌తో రూ.3.39 ట్రిలియ‌న్ల‌కు చేరాయి.

డిజిట‌ల్ చెల్లింపుల్లో డెబిట్ కార్డుల‌దే హ‌వా

డిజిటల్ చెల్లింపుల కోసం ఎక్కువ‌గా డెబిట్ కార్డులనే వినియోగిస్తున్నార‌ని ఆర్‌బీఐ నివేదిక తెలిపింది. ఏప్రిల్ నెల‌లో 1.21 బిలియ‌న్ల లావాదేవీలు జ‌ర‌గ్గా వాటి విలువ‌ రూ.3.39 ట్రిలియ‌న్లు. ఇక ఏప్రిల్ నెల‌లో జ‌రిగిన‌ ఏటీఎం లావాదేవీలు 808.91 మిలియ‌న్లు కాగా మొత్తం విలువ రూ.2.84 ట్రిలియ‌న్లు, మిగ‌తా లావాదేవీలు పీఓఎస్‌ల ద్వారా జ‌రిగాయి.

2018-19 సంవ‌త్స‌రంలో 14.27 బిలియ‌న్ల డెబిట్ కార్డు లావాదీవీలు జ‌రిగాయి, గ‌తేడాదితో పోలిస్తే 19.4 శాతం పెరిగాయి. లావాదేవీల విలువ కూడా 16.2 శాతం పెరిగి రూ.39.04 ట్రిలియ‌న్ల‌కు చేరింది. డెబిట్ కార్డుతో చెల్లింపులు సుల‌భ‌మైన విధానం కాబ‌ట్టి రోజురోజుకి వీటి వాడకం పెరుగుతోంది. డెబిట్ కార్డులు ముఖ్యంగా న‌గ‌దును విత్‌డ్రా చేసేందుకు ఉప‌యోగిస్తారు. జ‌న‌ధ‌న్ ఖాతాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఈ-కామ‌ర్స్ సంస్ల‌ల‌కు పేమెంట్లు పెర‌గ‌డం ద్వారా డెబిట్ కార్డు వినియెగం పెరిగింది.

ఆర్‌టీజీఎస్ లావాదేవీలు గ‌తేడాదితో పోలిస్తే ఏప్రిల్ నెల‌లో 7.7 శాతం పెరిగాయి. లావాదేవీల మొత్తం 11.48 మిలియ‌న్లు పెర‌గ్గా, వాటి విలువ 16.9 శాతం వృద్ధితో రూ.1,715 ట్రిలియ‌న్లుగా న‌మోదైంది. నెఫ్ట్ లావాదేవీలు 203.44 మిలియ‌న్లు కాగా వాటి విలువ రూ.20.54 ట్రిలియ‌న్లుగా ఉంది. గ‌తేడాది ఇవి 167.35 మిలియ‌న్ల‌తో రూ.16.32 ట్రిలియ‌న్లుగా న‌మోద‌య్యాయి.

ఇక‌ ఏప్రిల్‌లో మొబైల్ వాలెట్ల ద్వారా జ‌రిగిన లావాదేవీలు 378.87 మిలియ‌న్లు అంటే రూ.15,548 కోట్లు. గ‌తేడాది ఇదే ఏడాది 279.28 మిలియ‌న్ల లావాదేవీలు జ‌ర‌గ్గా వాటి విలువ రూ.11,695 కోట్లుగా ఉంది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly