యూలిప్ ల‌లో మ‌దుపు చేయోచ్చా?

బీమా హామీ మొత్తం త‌క్కువ‌గా, ప్రీమియం మొత్తం ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల‌ జీవిత బీమా కోణంలో ఇది సరైనది కాదు.

యూలిప్ ల‌లో మ‌దుపు చేయోచ్చా?

యూనిట్-లింక్డ్ బీమా పథకాలు (యూలిప్‌లు) అనేవి బీమా సంస్థలు మీకు స్వచ్ఛమైన జీవిత బీమా పాలసీ మార్కెట్ అనుసంధానిత పెట్టుబ‌డి కలయికతో ఉంటాయి. బీమా సంస్థ‌కు చెల్లించే ప్రీమియంలో కొంత భాగం బీమా ప్రీమియంగా, కొంత భాగం ఈక్విటీ లేదా డెట్ పెట్టుబ‌డులుగా వెళ్తుంది. ఇవి ఐదు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిలో కలిగి ఉంది. మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యం ఆధారంగా లార్జ్, మిడ్, స్మాల్, క్యాప్, డెట్ లేదా బ్యాలెన్సెడ్ పెట్టుబ‌డి పథ‌కాల‌ను ఎంపిక‌చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డి చేసిన మ‌దుప‌ర్లు త‌మ పెట్టుబ‌డుల‌ను వేర్వేరు ఫండ్ల‌లోకి మార్చేందుకు అవ‌కాశం ఉంటుంది. విస్తృతంగా పెన్షన్, ఎండోమెంట్ అని రెండు రకాల యూలిప్‌లు అందుబాటులో ఉంటాయి. పెన్షన్ యూలిప్ ల‌లో ఫండ్ స‌మ‌కూర్చే భాగం, మెచ్యూరిటీ మొత్తం యాన్యూటీల్లో పెట్టుబడి చేస్తారు. ఎండోమెంట్ యూలిప్ లో కూడా ఫండ్ భాగం ఉంటుంది. అయితే ఇందులో ఫండ్ మొత్తాన్ని ఐదు సంవత్సరాలు తర్వాత తీసుకునేందుకు వీలుంటుంది. ఈ యూలిప్ లో డెత్ బెన్‌ఫిట్ కూడా ఉంటుంది ఈ రెండు ర‌కాల ప‌థ‌కాల్లోనూ పెట్టుబ‌డి ప‌థ‌కాల‌ను ఎంపిక చేసుకోవచ్చని నిపుణులు పేర్కొన్నారు. పెట్టుబ‌డి చేసేందుకు ఎంచుకునే ప‌థ‌కాల‌ను బ‌ట్టి వీటి కేట‌గిరీలు ఆధార‌ప‌డి ఉంటాయి. బాండ్ ఫండ్లు అయితే ప్రభుత్వ బాండ్ల‌లో పెట్టుబడి పెట్టడం, కార్పొరేట్, స్థిర ఆదాయ సంబంధిత ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డి చేస్తుంటాయి. ఈక్విటీ ఫండ్లు అయితే, కంపెనీ స్టాక్స్లో పెట్టుబడి పెడుతుంటాయి. బ్యాలెన్స్‌డ్ ఫండ్లు అయితే ఈక్విటీ, డెట్ రెండింటి మిశ్రమాన్ని కలిగి ఉన్నపెట్టుబ‌డి ప‌థ‌కాలు. 15 సంవత్సరాల క్రితం భారతీయ మార్కెట్లో ఉలిప్స్ ప్రవేశపెట్టినప్పుడు, 40-50% వసూలు చేసేవార‌ని నిపుణులు పేర్కొన్నారు. 2010 లో రెగ్యులేటరీ, పరిశ్రమ జోక్యంతో వీటి ఛార్జీలు త‌గ్గాయి. యూలిప్ కేటాయింపు, పాలసీ నిర్వ‌హ‌ణ‌, మోర్టాలిటీ, ఫండ్ నిర్వ‌హ‌ణ ఛార్జీలు లాంటి నాలుగు రకాల రుసుములు ఉంటాయి. ఫండ్ నిర్వ‌హ‌ణ ఛార్జీల పై 1.35% గ‌రిష్ట ప‌రిమితి విధించారు.

యూలిప్ ల‌లో పన్ను మినహాయింపు పొందవచ్చు. గత సంవత్సరం బడ్జెట్ లో పరిచయం చేసిన దీర్ఘకాల పెట్టుబడి లాభాలు పన్ను యూలిప్ ల‌కు వ‌ర్తించ‌దు. ఇది ఒక ఈఈఈ (మినహాయింపు-మినహాయింపు-మినహాయింపు) కేట‌గిరీలోకి వ‌స్తుంది. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపుని పొందవచ్చు.

యూలిప్ ల‌లో పెట్టుబడి పెట్టే నిర్ణ‌యం మ‌దుప‌ర్లు తాము యూలిప్ న‌లు పెట్టుబడి ప‌థ‌కంగా చూస్తున్నారా లేదా జీవిత బీమా గా చూస్తారా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాల పొదుపు దృక్పథాన్ని కలిగి ఉండి మార్కెట్-సంబంధిత పెట్టుబ‌డులు చేసే వారికి యూలిప్ లు ఎంచుకోవ‌చ్చ‌ని నిపుణ‌లు అంటున్నారు. అయితే వీటిలో ఐదు సంవత్సరాల నిర్బంధిత కాల‌వ్యవధి ఒక నిరోధంగా ఉండవచ్చు. బీమా హామీ మొత్తం త‌క్కువ‌గా, ప్రీమియం మొత్తం ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల‌ జీవిత బీమా కోణంలో ఇది సరైనది కాదు. యూలిప్ ల‌లో రూ. 1 కోటి బీమా హామీ మొత్తానికి ప్రీమియం రూ. 2-3 లక్షలు అవుతుంది.రూ. 1 కోటి జీవిత బీమా హామీ మొత్తం పొందేందుకు ట‌ర్మ్ బీమా ప్రీమియంలు రూ.7,000-8,000 పరిధిలో అందుబాటులో ఉంటాయ‌ని నిపుణ‌లు అంటున్నారు. పెట్టుబడి ప్రణాళికగా యూలిప్ ల‌ను ప‌రిగ‌ణిస్తే, ఐదు సంవత్సరాల లాక్-ఇన్ కాల‌ప‌రిమితి ఒక సమస్య ఉంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ల‌లో నిధుల‌ నిష్క్రమణ మార్గాలు
చాలా సుల‌భంగా ఉంటాయి .

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly