పీఎఫ్‌ గురించి పూర్తిగా తెలుసుకోవాల‌నుకుంటున్నారా?

ప్రతి సంవత్సరం ప్రకటించిన వడ్డీ రేట్ల ప్రకారం, నెలవారీ నిల్వలపై వడ్డీని లెక్కించి ఉద్యోగి ఖాతాలో జమ చేస్తారు.

పీఎఫ్‌ గురించి పూర్తిగా తెలుసుకోవాల‌నుకుంటున్నారా?

క్లెయిమ్/ ఉప‌సంహ‌ర‌ణ‌లు
ఇంటి కొనుగోలు/ కట్టుకోవడం కోసం భవిష్య నిధి నుంచి సొమ్ము తీసుకోవచ్చు. అయితే దీనిని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.

వ‌డ్డీ:
ప్రతి సంవత్సరం ప్రకటించిన వడ్డీ రేట్ల ప్రకారం , నెలవారీ నిల్వలపై వడ్డీని లెక్కించి ఉద్యోగి ఖాతాలో జమ చేస్తారు.

పీఎఫ్ కాంట్రిబ్యూష‌న్‌

 • ఉద్యోగి జీతం (బేసిక్ + కరువు భత్యం - డి ఏ) నుంచి యజమాని తన వాటాను కూడా మినహాయించుకోకూడదు . అలా మిన‌హాయిస్తే అది శిక్షార్హమైన నేరము. అలాగే జీతం తగ్గించడం కూడా చేయరాదు.
 • రోజువారి కార్మికులు లేదా పీస్ రేటెడ్ వారు కూడా ఈ పీ ఎఫ్ సభ్యులుగా చేరవచ్చు. వారికి చెల్లించే నెలవారీ వేతనాన్ని పరిగణనలోకి తీసుకుని లెక్కించవచ్చు.
 • ఉద్యోగి వాటా , యజమాని వాటా ప్రతి నెలా గడువులోగా ఈ భవిష్యనిధి ఓ కి జమ చేయాలి. ఆలస్యమైనచో జరిమానాతో చెల్లించాలి.
 • ఉద్యోగి తాత్కాలిక తొలగింపు సమయంలో చెల్లించే వేతనం నుంచి పీ ఎఫ్ వాటాను చెల్లించాల్సిన అవసరం లేదు.
  ఉద్యోగి మానివేసిన సమయంలో పీ ఎఫ్ వాటాను చెల్లించాల్సిన అవసరం లేదు .
 • ఒకవేళ సంస్థ/ యజమాని, ఉద్యోగి భవిష్యనిధి వాటాను ఈ పీ ఎఫ్ ఓ కి జమ చెయ్యకపోతే… ఈపీఎఫ్ఓ, ఐపీసీ సెక్షన్ 406/409 ద్వారా యజమాని ఫై కేసు నమోదు చేయవచ్చు.
 • ఒకవేళ సంస్థ /యజమాని, ఉద్యోగి భవిష్యనిధి వాటాను ఈపీఎఫ్ఓ కి జమ చెయ్యకపోతే, భవిష్యత్తులో సంస్థ యజమాని నుంచి వసూలు అయిన మొత్తం నుంచి చెల్లింపబడుతుంది.
 • సంస్థ కు రావలిసిన బాకీలను, ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ సొమ్ము నుంచి రాబట్టుకోకూడదు.
 • సంస్థ/ యజమాని నుంచి భవిష్యనిధి సొమ్మును రాబట్టుకునేందుకు బ్యాంకు ఖాతాలను స్వాధీనం చేసుకోవడం , సంస్థ ఆస్తులను అమ్మడం, యజమానిని అరెస్ట్ చేయడం వంటి వాటి ద్వారా ఈపీఎఫ్ఓ న్యాయ పరమైన చర్యలను తీసుకుంటుంది.

 • ఒకవేళ ఉద్యోగి భవిష్యనిధి వాటాను ఈపీఎఫ్ఓకి జమ చేయని పక్షంలో , ఉద్యోగి యుఏఎన్ (UAN) ద్వారా తన ఈ-పాస్‌బుక్‌లో జమ అయినదో లేదో చూసుకోవచ్చు. ప్రస్తుతం పీఎఫ్ ఖాతాకు మొబైల్ నెంబర్ అనుసంధానించడం ద్వారా కూడా నెలవారీ జమ అవుతోందో లేదో తెలుసుకోవచ్చు.

 • ఉద్యోగి భవిష్యనిధి ఖాతాలో సొమ్ము భద్రం, సురక్షితం. న్యాయస్థానాలు కూడా ఈ సొమ్ము ఫై న్యాయపరమైన చర్యలు తీసుకోలేవు.

 • సంస్థ / యజమాని దివాళా లేదా మూసివేసినా , ఇతర రుణ దాతల కన్నా ముందు ఈ పీ ఎఫ్ ఓ కి చెల్లించాల్సిన దానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

 • ఉద్యోగికి జీతం/ వేతనం చెల్లించే ముందే ఉద్యోగి వాటాని తీసివేయాలి .

 • ఉద్యోగి తన వాటా కింద 12 శాతం తో పాటు , అదనంగా చేయదలచిన స్వచ్ఛంద వాటా కింద కూడా కలిపి మొత్తం రూ 15 వేల వరకు జమ చేయవచ్చు.

 • రూ 15 వేల కంటే అధికంగా జమ చేయదలిస్తే ఈ పీ ఎఫ్ ఓ వారి అనుమతి అవసరం.

 • కాంట్రాక్టర్ ద్వారా పనిచేసే ఉద్యోగుల జీతాల నుంచి / కార్మికుల వేతనాల నుంచి వారి వాటాతో పాటు పీ ఎఫ్ ను జమ చేయనించాల్సిన బాధ్యత ముఖ్య సంస్థ ఫై ఉంటుంది.

 • సంస్థ/ యజమాని వాటాలో కొంత మొత్తాన్ని పెన్షన్ ఫండ్ కి బదిలీ చేస్తారు కాబట్టి, ఇందుకోసం ఉద్యోగి అంగీకారం అవసరం ఉండదు.

 • వయసుతో నిమిత్తం లేకుండా ఉద్యోగి సర్వీసులో ఉన్నంత కాలం నెలవారీ పీ ఎఫ్ మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగి పెన్షన్ స్కీం వయసు దాటితే (అంటే 58 సంవత్సరాలు ), యజమాని వాటాను కూడా పీ ఎఫ్ ఖాతాలోనే జమ చేయాల్సి ఉంటుంది .

పూర్తి చెల్లింపు
భవిష్యనిధి సొమ్ము 20 రోజులలో రాకపోతే , ఈ కింది లింక్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. http://epfigms.gov.in/Grievance/GrievanceMaster.
లేదా ప్రతి నెల 10 వ తేదీ జరిగే ’ నిధి ఆప్ కె నికట్ ’ ద్వారా కమీషనర్ వారిని కలవవచ్చు.

ఉద్యోగానికి రాజీనామా చేసిన రెండు నెలల తరువాత పూర్తి మొత్తాన్ని భవిష్యనిధి నుంచి తీసుకోవచ్చు. ఉద్యోగి తన భవిష్య నిధి నుంచి ఉపసంహరించుకునే ద‌ర‌ఖాస్తు పత్రంపై సంతకం చేయాల్సిన బాధ్యత సంస్థ / యజమాని ఫై ఉంది. ఒకవేళ, సదరు సంస్థ/ యజమాని సంతకం చేయ‌క‌పోతే ఆ ఉద్యోగి తనకు ఖాతా ఉన్న బ్యాంకు వారిచే సంతకం చేయించి , అందుకు గల కారణాలను తెలియజేస్తూ, రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్ ఆఫీస్ లో సమర్పించాలి. అవసరమైతే సంస్థ/ యజమాని తో కమీషనర్ సంప్రదిస్తారు .
ఒకవేళ ఉద్యోగి తన యుఏఎన్ (UAN ) కు తన బ్యాంకు ఖాతాను, ఆధార్ ని అనుసంధానించినట్లైతే , కంపోజిట్ క్లెయిమ్ ద్వారా సమర్పించవచ్చు. దీనికి ఉద్యోగి సంతకం సరిపోతుంది.

పీఎఫ్ బ‌దిలీ:
ఉద్యోగం మారినపుడు కొత్త సంస్థకు భవిష్యనిధి ఖాతాను బదిలీ చేసుకోవచ్చు. దీనికి ఫారం 13(R ) సమర్పించాలి. యూనిఫైడ్ పోర్టల్ ద్వారా కూడా ఆన్లైన్ లో బదిలీ చేసుకోవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly