ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్ల‌లో పెట్టుబ‌డుల‌కు ఏది మేలు?

ఇండెక్స్ ఫండ్లు స‌ద‌రు ఇండెక్స్ లో ఉండే షేర్లు, వాటి ప‌రిమాణాల‌కు అనుగుణంగా పెట్టుబడి పెడ‌తాయి.

ఈటీఎఫ్, ఇండెక్స్  ఫండ్ల‌లో పెట్టుబ‌డుల‌కు ఏది మేలు?

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల‌ లో పెట్టుబడి పెట్టడం ద్వారా మ‌దుప‌ర్లు దీర్ఘకాలంలో (పది సంవత్సరాల లేదా అంతకంటే ఎక్కువ కాలం) మంచి రాబడిని పొందుతారు. ఈక్విటీ మార్కెట్లు స్వల్ప కాల వ్యవధిలో అస్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. కానీ దీర్ఘకాలంలో మాత్రం, స్థిరమైన రాబడులను అందిస్తాయని ఇప్ప‌టికే చాలా సార్లు నిరూపితమైంది. ఏఎంసీలు అభివృద్ధి చేసిన వివిధ వర్గాలు, కలయికలలో చాలా మ్యూచువల్ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి మొత్తం ఈక్విటీ లోనూ లేదా మొత్తం డెట్ లోనూ లేదా హైబ్రిడ్ ఫండ్లు అంటే ఈక్విటీ, డెట్ కలయికలో గానీ అందుబాటులో ఉంటాయి. ఈక్విటీలను లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్లు, మల్టీ క్యాప్, సెక్టార్ ఫండ్లు వారీగా వర్గీకరించారు. ప‌ని తీరులో ఈ ఫండ్లు వాటికి సంబంధించిన బెంచ్ మార్కుల‌ను ల‌క్ష్యంగా పెట్టుకుంటాయి. బెంచ్ మార్కు కంటే తమ ఫండ్ రాబడులు ఎక్కువగా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు పెట్టుబడిదారులకు ఇది సహాయపడుతుంది. దీనిని ‘ఆల్ఫా’ అని పిలుస్తారు. ఆర్థిక స్థిరత్వం, భద్రత, గుర్తింపు కలిగి ఉన్న కంపెనీలను బెంచ్ మార్క్ లో చేర్చారు.

ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్), ఇండెక్స్ ఫండ్స్ అనే మరో రెండు విభాగాలు ఉన్నాయి. ఇవి రెండూ ఏదైనా ఒక సూచీని అనుక‌రించి పెట్టుబ‌డులు చేస్తుంటాయి.

ఇండెక్స్ ఫండ్లు స‌ద‌రు ఇండెక్స్ లో ఉండే షేర్లు, వాటి ప‌రిమాణాల‌కు అనుగుణంగా పెట్టుబడి పెడ‌తాయి.

ఈటీఎఫ్ కూడా బెంచ్ మార్కును అనుసరిస్తూ, బెంచ్ మార్క్ లోని అన్ని లేదా కొన్ని స్టాక్ లలో పెట్టుబడి పెడుతుంది. ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్లు ట్రాకింగ్ ఎర్ర‌ర్ క‌లిగి ఉంటాయి. బెంచ్ మార్క్ కంటే కొంచెం శాతం రాబ‌డిని త‌క్కువ‌గా అందిస్తాయి.

ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్ల నిర్వ‌హణ వ్యయాల నిష్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. వీటికున్న పెద్ద ప్రయోజనం ఇదే. ఎందుకంటే ఫండ్ నిర్వాహకుడికి ప‌రిశోధ‌న‌, వ్యూహాలు త‌దిత‌ర అంశాలేమీ ఉండ‌వు. కేవలం బెంచ్ మార్కును అనుసరిస్తూ ఉంటారు. కాబ‌ట్టి వీటిలో నిర్వ‌హ‌ణ‌ రుసుం త‌క్కువ‌గా ఉంటుంది.

ఇవి నష్ట భ‌యం ఉన్న పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటాయి. ఇప్పటికీ ఈక్విటీ పెట్టుబడులను పెడుతూ, సూచికలను అనుసరించవచ్చు. ఫండ్లు రెగ్యులర్, డైరెక్ట్ ఎంపికలను పెట్టుబడిదారులకు అందిస్తాయి, ఇక్కడ రెగ్యులర్ పెట్టుబడిదారులు తమ ఏజెంట్ లేదా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా పెట్టుబడి పెట్టాలి. అప్పుడు వారికి కొంత కమీషన్ చెల్లించాల్సి ఉంటుంది.

డైరెక్ట్ మోడ్ లో, పెట్టుబడిదారుడు నేరుగా ఏఎంసీ కు పెట్టుబడి పెట్టవచ్చు, ఇలా చేయడం ద్వారా పెట్టుబడిదారుడు పంపిణీదారులకు ఎలాంటి కమీషన్ ను చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే 1 నుంచి 1.5 శాతం అధిక రాబడిని అందిస్తాయి.

ప్రస్తుతం ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్లలో ఎక్కువ భాగం నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, సెన్సెక్స్ ను అనుసరిస్తున్నాయి. ఇవి సురక్షితంగా, నిలకడగా ఉంటూ, దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తాయి.

ఈ కింది పట్టికలలో లార్జ్ క్యాప్ ఇండెక్స్ నిఫ్టీ 50, సెన్సెక్స్ లను అనుసరించే ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్లను 1 సంవత్సరం, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవ‌త్స‌రాల‌ రాబడులతో సూచిస్తున్నాయి.

ETF.jpg
INDEX.jpg

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly