న‌గ‌దు బ‌దిలీలో... ఎన్ఈఎఫ్‌టీ లేదా ఆర్‌టీజీఎస్

వినియోగ‌దారులు డబ్బును బదిలీ చేయడానికి ముందు ఎన్ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్ ల మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలి

న‌గ‌దు బ‌దిలీలో... ఎన్ఈఎఫ్‌టీ లేదా ఆర్‌టీజీఎస్

నిధులను బదిలీ చేయడానికి మీ నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించే వారు ఎన్ఈఎఫ్‌టీ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్) ఆర్‌టీజీఎస్ (రియల్ టైమ్ గ్రోస్ సెటిల్మెంట్) ఎంపికల గురించి తెలిసి ఉంటారు. కానీ ఈ డబ్బు బదిలీ సదుపాయాల గురించి లేదా వాటి మధ్య గల వ్యత్యాసాల గురించి సంబంధిత ఇతర వివరాల గురించి మీకు తెలుసా? ఆర్‌టీజీఎస్, ఎన్ఈఎఫ్‌టీ రెండూ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న రియ‌ల్ టైమ్ చెల్లింపు వ్యవస్థలు, కాని ఇవి ఎలా పనిచేసే విధానంలో వ్యత్యాసాలు ఉన్నాయి.

లావాదేవీల వేళ‌లు:
ఆర్‌టీజీఎస్ లావాదేవీల కోసం ఉదయం 9 గంటల నుంచి 4:30 వరకు, శనివారాలలో 9 నుంచి 1:30 వరకు ఉంటుంది. ఎన్ఈఎఫ్‌టీ సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి 6:30 వరకు నడుస్తుంది.

ఈ వేళ‌ల్లో బ్యాంకులు బ‌ట్టి కొంత తేడా ఉండవచ్చు. ప‌నిచేసే వేళ‌లా ప‌రంగా చూస్తే న్ఈఎఫ్‌టీ లావాదేవీలకు ఎక్కువ స‌మ‌యం కలిగి ఉంటాయి. అయితే, ఎన్ఈఎఫ్‌టీ లావాదేవీలు బ్యాచ్ల వారీగా జరుగుతాయి. కాబ‌ట్టి మీరు న‌గ‌దు బదిలీ కోసం అభ్యర్థనను ఉంచినప్పటి నుంచి బదిలీ అయ్యేందుకు కొంత స‌మ‌యం పుడుతుంది. ఆర్‌టీజీఎస్ లావాదేవీలు, వెంట‌నే రియ‌ల్ టైమ్ లో జ‌రుగుతాయి. ఇక్కడ, మీరు లావాదేవీని నిర్వహిస్తున్న వెంటనే నిధులను బదిలీ చేయడానికి సూచనలను బ‌దీలీ పొందే బ్యాంకు చేరి బదిలీ తక్షణం అవుతుంది.

వ్యయాలు, పరిమితులు:
ఆర్‌టీజీఎస్ పెద్ద లావాదేవీలకు ఉద్దేశించింది. దీని ద్వారా చెల్లించవలసిన కనీస మొత్తం రూ. 2 లక్షలు, గ‌రిష్ట ప‌రిమితి ఉండ‌దు. ఎన్ఈఎఫ్‌టీ, ద్వారా చేసే లావాదేవీల‌కు కనీస బదిలీ పరిమితి లేదు. బ్యాంకు ఖాతాదారుల కోసం, ఒక లావాదేవీపై పరిమితి రూ. 10 లక్షలు ఉంటుంది.మొత్తం లావాదేవీల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేదు. అయితే బ్యాంక్ ఖాతా లేకుండా ఎన్ఈఎఫ్‌టీ స‌దుపాయం అందుబాటులో ఉండే బ్యాంకు శాఖల ద్వారా నగదును బదిలీ చేయడానికి ఈ సౌకర్యం ఉపయోగించే వ్యక్తులకు రూ. 50,000 ల వ‌ర‌కూ మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది.

చాలా బ్యాంకు సేవల మాదిరిగా, ఫండ్ బదిలీకి రుసుములకు త‌క్కువ‌గానే ఉంటాయి. ఆర్‌బీఐ గరిష్ఠ పరిమితుల ప్రకారం, ఎన్ఈఎఫ్‌టీ విషయంలో, రూ. 10,000 వరకు బదిలీ కోసం రుసుము రూ. 2.50 వరకు ఉంటుంది. రూ. 10,000 నుంచి రూ. 1 లక్ష వ‌ర‌కూ బదిలీ కోసం, రుసుఉ రూ. 5 వరకు ఉంటుంది. రూ .1 లక్ష నుంచి రూ. 2 లక్షలకు, రుసుము రూ.15 ఉంటుంది. రూ. 2 లక్షలకు పైన బదిలీ కోసం రుసుము రూ. 25 వరకు ఉంటుంది. ఆర్‌టీజీఎస్ విషయంలో, రూ. 2 ల‌క్ష‌ల నుంచి రూ. 5 లక్షల లావాదేవీలకు 25-30 రూపాయలు, రూ. 5 లక్షల పైన లావాదేవీలకు రూ. 50-55 వ‌ర‌కూ రుసుము ఉంటుంది. ఈ ఛార్జీలు ఒక్కో బ్యాంకుకు ఒక్కో విధంగా ఉండవ‌చ్చు. అందువల్ల బ్యాంక్ వెబ్సైట్ని లావాదేవీకి ముందు తనిఖీ చేయడమే మంచిది.

బదిలీ ప్రక్రియ పరంగా రెండు ఒకేలా ఉంటాయి. మొదట మీరు మీ ఖాతాకు లబ్దిదారుడి బ్యాంకు ఖాతాను జత చేసి, ఆపై యాక్టివేష‌న్ కోసం వేచి ఉండాల్సిన అవసరం ఉంది. లబ్ధిదారుడిని ధ్రువీకరించిన తర్వాత, మీరు కావలసిన ఖాతాకు నిధులను బదిలీ చేయడాన్ని ప్రారంభించవచ్చు.

జాగ్ర‌త్త‌గా నమోదు:
ఈ చెల్లింపు వ్యవస్థలు నిధులను సులభంగా బదిలీ చేయటానికి రూపకల్పన చేసిన‌వి. అయితే మీరు డబ్బును బదిలీ చేస్తున‌పుడు వివరాలను జాగ్ర‌త్త‌గా నమోదు చేయాలి. ఆర్‌టీజీఎస్ లావాదేవీలు రియ‌ల్ టైమ్ ప్రాతిపాదిక‌న జ‌రుగుతాయి. వీటికి సంబంధించి సెటిల్‌మెంట్ ప్ర‌క్రియ ఆర్‌బీఐ పుస్తకాలలో జరుగుతుంది కాబట్టి, అన్ని చెల్లింపులు అంతిమమైన‌వి. ఈ చెల్లింపులు ఒక సారి చేశాక మ‌ళ్లీ తిరిగి పున‌రుద్ధ‌రించ‌లేము. ఎన్ఈఎఫ్‌టీ బ‌దిలీల‌లో బ్యాంకు ప్రారంభించిన తర్వాత చెల్లింపును ఆపే అవకాశం లేదు. కాబట్టి ఒక చిన్న తప్పు ఒక పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly