ప‌న్ను మిన‌హాయింపు-త‌గ్గింపు-రాయితీల మ‌ధ్య తేడా ఏంటి?

ప‌న్ను లెక్కించేట‌ప్పుడు మొద‌ట‌గా మిన‌హాయింపుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.

ప‌న్ను మిన‌హాయింపు-త‌గ్గింపు-రాయితీల మ‌ధ్య తేడా ఏంటి?

ప‌న్ను సంబంధిత వివ‌రాల గురించి చాలా మందికి అవ‌గాహ‌న ఉండ‌దు. దీనికోసం ప‌న్ను అధికారుల‌ననుంచి స‌ల‌హాలు తీసుకుంటారు. అయితే ప‌న్ను మిన‌హాయింపులు, త‌గ్గింపులు, రాయితీల మ‌ధ్య తేడా ఏంటి? దీని గురించి అంద‌రు తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

ప‌న్ను మిన‌హాయింపులు(Tax exemptions)
కొన్ని ర‌కాల ఆదాయం ప‌న్ను ప‌రిది నుంచి మిన‌హ‌యింపు ఉంటుంది. అంటే ఆయా మార్గాల ద్వారా వ‌చ్చిన ఆదాయంపై ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ప‌న్ను గురించి లెక్కించేట‌ప్పుడు మిన‌హాయింపు పొందే ఆదాయాన్నిముందుగా ప‌రిగ‌ణించాలి. ఉదాహ‌ర‌ణ‌కు హెచ్ఆర్ఏకి ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. మీకు హెచ్ఆర్ఏ వ‌స్తే దానిపై ప‌న్ను మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఏదైనా స్థిరాస్తి విక్రయించిన‌ప్పుడు పొందిన లాభాల‌ను నిర్ధేశిత కాలంలె తిరిగి ప్రాప‌ర్టిలో లేదా బాండ్ల‌లో పెడితే ప‌న్ను మిన‌హాయింపు కోర‌వ‌చ్చు. సెక్ష‌న్ 10(1) ప్ర‌కారం, ఆదాయ ప‌న్ను చ‌ట్టం 1961 వ్య‌వ‌సాయ ఆదాయంపై కూడా ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

ప‌న్ను త‌గ్గింపు(Tax deductions)
మీరు మీ జీతం లేదా మొత్తం ఐదు ర‌కాలుగా నుంచి ఆదాయం నుంచి మినహాయింపు ఆదాయాన్ని తీసివేసిన తర్వాత స్థూల ఆదాయాన్ని పొందుతారు. ఆ వ‌చ్చిన ఆదాయంలో మీరు పెట్టిన పెట్టుబ‌డుల‌ను ఆధారంగా చూపుతూ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు మీరు వేత‌న జీవులైతే ఒక‌ ఆర్థిక సంవ‌త్స‌రానికి మీ వేత‌నం నుంచి ప్రామాణిక మిన‌హాయింపు రూ.40 వేలు అనుకుందాం. దీంతో పాటు సెక్ష‌న్ 80సీ ప్ర‌కారం రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు కోర‌వ‌చ్చు ఒక‌వేళ మీరు ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్‌, ఎన్ఎస్‌సీ వంటి వాటిలో పెట్టుబ‌డుల‌కు. పిల‌ల్ల ట్యూష‌న్ ఫీజు, స్టాంప్ డ్యూటీ వంటివి కూడా ప‌న్ను త‌గ్గింపు పొందే పెట్టుబ‌డులు. దీంతో పాటు సెక్ష‌న్ 80డీ, 80ఈ, 80జీ వంటివి కూడా ప‌న్ను మిన‌హాయింపులు పొంద‌వ‌చ్చు.

ప‌న్ను రాయితీ(Tax rebates)
ప‌న్ను మిన‌హాయింపు, త‌గ్గింపుల త‌ర్వాత మిగిలిన ఆదాయంపై ప‌న్ను చెల్లించాలి. ప‌న్ను లెక్కించిన త‌ర్వాత చెల్లించాల్సిన మొత్తంలో మ‌దింపు పొంద‌వ‌చ్చు. అంటే సెక్ష‌న్ 87ఏ ప్ర‌కారం మొత్తం ఆదాయం రూ.3.5 ల‌క్ష‌ల కంటే త‌క్కువ‌గా ఉంటే చెల్లించాల్సిన ప‌న్నులో రూ.2,500 వ‌ర‌కు రాయింతీ పొంద‌వ‌చ్చు.

ఒక‌రు ఏడాదికి రూ.5 ల‌క్ష‌ల కంటే ఎక్కువ‌గా ఆదాయాన్ని పొందుతున్నారు. హెచ్ఆర్ఏ రూ.రూ.50 వేలు మిన‌హాయించి స్థూల ఆదాయం రూ.4.5 ల‌క్ష‌లు వ‌స్తుంది. దీంతో పాటు ఏడాదికి రూ.1.5 ల‌క్ష‌ల మిన‌హాయింపు ల‌భిస్తుంది. అంటే మొత్తం ఆదాయం రూ.3 ల‌క్ష‌ల‌కు త‌గ్గుతుంది. దీనిపై ఆ వ్య‌క్తి ప‌న్ను చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. అయితే పైన చెప్ప‌న‌ట్లుగా ఈ ఆదాయంపై 5 శాతం ప‌న్ను ప‌రిదిలోకి వ‌స్తుంది కాబ‌ట్టి రూ.2,500 రాయితీ పొంద‌వ‌చ్చు. అంటే ఆ వ్య‌క్తి ఎలాంటి ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

ప‌న్ను మిన‌హాయింపు, త‌గ్గింపులు, రాయితీల గురించి తెలుసుకొని పూర్తి ప‌న్నుప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly