వివిధ బీమా సంస్థల టర్మ్ పాలసీ ప్రీమయం వివరాలు
పదవీ విరమణ వరకు ఆదాయం పెరుగుదలతో పాటు భవిష్యత్తు అవసరాల ప్రస్తుత విలువకు సమానంగా హామీ ఉండాలి
ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందీ అనేది ఎవరూ చెప్పలేరు. అందుకే ప్రతీ వ్యక్తీ తన కుటుంబానికి ఆర్థిక రక్షణ ఏర్పాటు చేయాలి. ఇందుకు జీవిత బీమా సరిగ్గా సరిపోతుంది. మనం సాధారణంగా రాబడిని ఆశించి పెట్టుబడి పెడుతుంటాం. అయితే జీవిత బీమాలో మాత్రం రాబడి కోసం పెట్టుబడి పెట్టకూడదు. సంపాదించే వ్యక్తి జీవించిలేనప్పుడు కూడా వారి కుటుంబానికి కావలసిన మొత్తాన్ని, జీవన ప్రమాణ స్థాయి తగ్గకుండా, కుటుంబ లక్ష్యాలను చేరుకునేంతవరకు ఏక మొత్తంగా(లేక క్రమానుగత ఆదాయం) అందించేందుకు గానూ జీవిత బీమాను తీసుకోవాలి. ఇది మీ కుటుంబ సభ్యులకు ఆర్థికంగా రక్షణ కల్పిస్తుంది. జీవిత బీమాలో టర్మ్ పాలసీలు తక్కువ ప్రీమియంతో ఎక్కువ హామీని అందిస్తాయి. ఇది చాలా మందికి తెలియదు. బీమా ఏజెంట్ల కమీషన్ శాతం ఇతర పాలసీల మాదిరిగానే ఉన్నప్పటికీ, ఇతర పాలసీలతో పోలిస్తే ప్రీమియం తక్కువగా ఉండడం వలన ఈ పథకానికి వారు ప్రాముఖ్యత ఇవ్వరు. పాలసీ దారుడు గడువు ముగిసే వరకు జీవించి ఉంటే ఎటువంటి చెల్లింపులు చెల్లించరు. ఒకవేళ గడువు ముగిసే సమయం కంటే ముందుగా పాలసీదారుడు మరణిస్తే, పాలసీ ప్రకారం హామీ మొత్తం నామినీకి చెల్లిస్తారు.
హామీ మొత్తం ఎంత ఉండాలి?
పదవీ విరమణ వరకు ఆదాయం పెరుగుదలతో పాటు భవిష్యత్తు అవసరాల ప్రస్తుత విలువకు సమానంగా హామీ ఉండాలి.
ఉదాహరణ: రాజు వయసు 40 సంవత్సరాలు. అతని నెలవారీ ఆదాయం రూ. 25 వేలు(వార్షికంగా రూ. 3 లక్షలు). 20 సంవత్సరాల కాలానికి టర్మ్ పాలసీని తీసుకుంటే పదవీ విరమణ సమయం వరకు సంపాదించే ఆదాయాన్ని, ప్రస్తుత విలువగా పరిగణించి హామీ మొత్తం ఉండాలి. ఒకవేళ దురదృష్టవసాత్తు రాజు మరిణిస్తే, క్లెయిమ్ చేసిన మొత్తం విలువపై రాబడి 8 శాతం, ద్రవ్యోల్భణం 6 శాతం (20 సంవత్సరాల కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే) గా భావించి బీమా మొత్తాన్ని లెక్కించవచ్చు.
సాదారణంగా బీమా సంస్థలు, 35 సంవత్సరాల లోపు వయసు ఉన్న వ్యక్తుల వార్షిక ఆదాయానికి గరిష్టంగా 20 నుంచి 25 రెట్లు బీమా హామీని అందిస్తాయి. 50 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తులకు, వారి వార్షిక ఆదాయానికి గరిష్టంగా 10 రెట్లు హామీని మాత్రమే అందిస్తాయి. అందువల్ల టర్మ్ పాలసీలను చిన్న వయసులోనే కొనుగోలు చేయడం మంచిది. అంతేకాకుండా తక్కువ ప్రీమియంతో ఎక్కువ హామీ పొందుతారు.
గుర్తుంచుకోవలసిన విషయాలు:
పదవీ విరమణ సమయం వరకు టర్మ్పాలసీ కాలవ్యవధి ఉండేలా చేసుకోవాలి. ఆ తరువాత జీవిత బీమా అవసరం ఉండదు. కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ శాతాన్ని తనిఖీ చేయాలి. ప్రీమియం తక్కువగా ఉన్న కారణంగా క్లెయిమ్ సెటిల్మెంటు శాతం తక్కువగా ఉన్న కంపెనీ నుంచి టర్మ్ పాలసీని కొనుగోలు చేస్తే, ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. ధూమపానం, పొగాకు వంటి అలవాట్ల గురించి బీమా సంస్థకు ముందుగానే తెలియచేయండి. మీకు సంబంధించిన అన్ని సరైన వివరాలను బీమా సంస్థకు తెలియజేయాలి. దీనివల్ల ఒకవేళ భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఎటుంవంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉంటాయి. మీరు తీసుకున్న పాలసీని గురించి మీ భార్య,పిల్లలకు తెలియజేయాలి. పాలసీ పత్రాలు భద్రపరిచిన ప్రదేశాన్ని కూడా వారికి తెలియచేయాలి.
హామీ మొత్తం రూ. 1కోటి ఉండే విధంగా 30,35,40 సంవత్సరాల వయసు గల వ్యక్తులకు 30,25,20 సంవత్సరాల కాలపరిమితులకు వివిధ బీమా సంస్థలు వర్తింపచేస్తున్న ప్రీమియంలు ఈ కింది పట్టికలో చూద్దాం.
సిరి లో ఇంకా:
మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్
(Source: Livemint)
Comments
0