మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఇలా ప్రారంభించ‌వ‌చ్చు

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు అందుబాటులో ఉన్న వివిధ మార్గాల వివరాలు తెలుసుకుందాం..

మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఇలా ప్రారంభించ‌వ‌చ్చు

మ్యూచువల్ ఫండ్లలో మూడు రకాలుగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. పెట్టుబడిదారు తన వీలుని బట్టి ఏ మార్గం అయినా ఎంచుకోవచ్చు.

మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతులుంటాయి. అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు, అనుమతి పొందిన సంస్థలు మదుపర్లకు ఆన్‌లైన్‌ సదుపాయాన్ని కల్పిస్తాయి. బ్యాంకులు, బ్రోకర్‌ ఏజెన్సీలు, పంపిణీదారులు, ఆర్థిక సలహాదార్లు మదుపర్లకు ఆఫ్‌లైన్‌ పద్ధతిలో మదుపు చేసేందుకు సహకరిస్తాయి.

మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు అవ‌స‌ర‌మైన‌వి :

 • పాన్‌ కార్డు
 • రెండు కలర్‌ ఫొటోలు
 • చిరునామా ధ్రువీకరణ పత్రం
 • గుర్తింపు కార్డు
 • కేవైసీ నమోదు
 • కేవైసీ దరఖాస్తు ఫారం
Individual-KYC-1.jpg

ఆన్‌లైన్ పెట్టుబ‌డి విధానం

మ్యూచువ‌ల్ ఫండ్ ఆన్‌లైన్ పెట్టుబ‌డుల‌ను మూడు విధాలుగా చేయొచ్చు

 • ఏఎమ్‌సీ వెబ్‌సైట్లు
 • బ్రోక‌ర్ వెబ్‌సైట్లు
 • ఇండిపెండెంట్ ప్లాట్‌ఫారంలు

అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల‌ (ఏఎమ్‌సీ) వెబ్‌సైట్లు :

మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థలు వెబ్‌సైట్ల ద్వారా నేరుగా పెట్టుబ‌డి పెట్టే స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనే మ్యూచువ‌ల్ ఫండ్ లావాదేవీల‌ను జ‌ర‌ప‌వ‌చ్చు. మొద‌టిసారి పెట్టుబ‌డి పెట్టేట‌ప్పుడు నేరుగా ఫండ్ కంపెనీని లేదా అధీకృత కేంద్రానికి పెట్టుబ‌డిదారు వెళ్లి ద‌ర‌ఖాస్తును స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. లేదా క్యామ్స్/ కార్వీ కేంద్రాల్లో సైతం ఈ ఫారంల‌ను స‌మ‌ర్పించ‌వ‌చ్చు.

ద‌శ‌ల‌వారీ చేయాల్సిన ప‌నులు:

 • కంపెనీ వెబ్‌సైట్ నుంచి ఎంచుకున్న ఫండ్ ఫారం ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
 • వివ‌రాల‌న్నీ నింపిన త‌ర్వాత ఫారంతో పాటు, మొద‌టి చెక్కు, పాన్‌కార్డు కాపీ, కేవైసీ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాలి.
 • ఆన్‌లైన్ లావాదేవీలు జ‌రిపేందుకు వ్య‌క్తిగ‌త గుర్తింపు సంఖ్య‌ (పిన్‌) కోసం ద‌ర‌ఖాస్తు
  చేయాలి.
 • ఒక‌సారి ద‌ర‌ఖాస్తు చేసిన త‌ర్వాత ఫోలియో నంబ‌రు, పిన్‌ కేటాయింపులు అయిన‌ట్ల‌యితే త‌దుప‌రి లావాదేవీల‌ను బ్యాంక్ ఖాతా ద్వారా ఆన్‌లైన్‌లోనే జ‌ర‌పొచ్చు.

బ్రోక‌ర్ ప్లాట్‌ఫారంలు:

 • ఇదివ‌ర‌కే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు డీమ్యాట్ ఖాతా క‌లిగి ఉంటే, మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను సైతం దాని ద్వారానే కొనుగోలు చేయ‌వ‌చ్చు.
 • పెద్ద పెద్ద బ్రోక‌రేజీల‌న్నీ ఈరోజుల్లో ఎన్ఎస్ఈ లేదా బీఎస్ఈ మ్యుచువ‌ల్ ఫండ్ ప్లాట్‌ఫారంల‌తో అనుసంధాన‌మై ఉంటాయి.
 • డీమ్యాట్ ఖాతాలోకి లాగిన్ అయి, మీరు పెట్టుబ‌డి పెట్టాల‌నుకున్న ప‌థ‌కాన్ని ఎంచుకోవ‌చ్చు.
 • సిప్ ద్వారా పెట్టుబ‌డి పెట్టాల‌నుకునేవారికి బ్రోక‌ర్లు ఆన్‌లైన్ సిప్ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నారు.
 • ఒక‌సారి యూనిట్ల కొనుగోలు జ‌రిపిన త‌ర్వాత డీమ్యాట్ ఖాతాలో ఈ యూనిట్లు జ‌మ అవుతాయి.

ఉదాహ‌ర‌ణ‌కు

ఐసీఐసీఐడైరెక్ట్‌, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌, కొట‌క్ సెక్యూరిటీస్‌, బిర్లా మైయూనివ‌ర్స్ వంటివి ఈర‌క‌మైన బ్రోక‌రేజీల్లో ఉన్నాయి.

ఇండిపెండెంట్ పోర్ట‌ల్స్‌:

 • మ్యూచువ‌ల్ ఫండ్ ఇన్వెస్ట‌ర్ల‌కు ప్రాథ‌మిక సేవ‌ల నుంచి మొద‌లుకొని అన్ని సంబంధిత సేవలు అందించేందుకు ఆన్‌లైన్ ఇండిపెండెంట్ వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి.
  ఉదా: ఫ‌ండ్స్ ఇండియా, ఫండ్ సూప‌ర్‌మార్ట్‌, ఇన్వెజ్ట, మొదలైన సంస్థలు
 • మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఆన్‌లైన్‌లోనే కొనే, అమ్మే స‌దుపాయాల‌ను ఇవి క‌ల్పిస్తున్నాయి.
 • చేయాల్సింద‌ల్లా మొద‌టిసారి ఆయా వైబ్‌సైట్ల‌లో ఖాతాను తెర‌వ‌డ‌మే.
 • మొద‌టిసారి ఆన్‌లైన్ ఖాతా తెరిచేట‌ప్పుడు ప్రాథ‌మిక స‌మాచారాన్ని నింపాలి.
  దాంతో పాటు పాన్ కార్డ్ కాపీ, ర‌ద్దుచేసిన చెక్కును అంద‌జేయాలి.
  పూర్తిచేసిన ద‌ర‌ఖాస్తును, అవ‌స‌ర‌మ‌య్యే ప‌త్రాల‌ను వారి మెయిల్ఐడీకి సైతం పంప‌వ‌చ్చు.
 • మీరు ఇది వ‌ర‌కే కేవైసీ న‌మోదు ప్ర‌క్రియ పూర్తి చేసి ఉండ‌క‌పోతే ఈ పోర్ట‌ల్ మీకు కేవేసీ ప్ర‌క్రియ‌లో స‌హ‌క‌రించి మొత్తం ప‌నిని చేసి పెడుతుంది.
 • అన్ని ప‌త్రాల‌ను స‌రి చూసిన త‌ర్వాత మీ ఖాతా తెరిచే ప్ర‌క్రియ పూర్త‌వుతుంది.
 • దాదాపు అన్ని బ్యాంకులతో ఈ వెబ్‌సైట్లు ఒప్పందం కుదుర్చుకుని ఉంటాయి.
  దీని ద్వారా త‌దుప‌రి లావాదేవీల కోసం బ్యాంకుల‌కు ఈసీఎస్ మ్యాన్డేట్ స‌మ‌ర్పిస్తే ఖాతా నుంచి నేరుగా సిప్ సిప్ పెట్టుబడులకు మల్లించడం అవుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly