డివిడెండ్ డిస్ట్రిబ్యూష‌న్ ట్యాక్స్‌

సంస్థ‌లు త‌మ వాటాదారుల‌కు పంచే డివిడెండ్‌పై డివిడెండ్ డిస్ట్రిబ్యూష‌న్ ప‌న్ను చెల్లిస్తాయి

డివిడెండ్ డిస్ట్రిబ్యూష‌న్ ట్యాక్స్‌

డివిడెండ్ డిస్ట్రిబ్యూష‌న్ ట్యాక్స్‌(డీడీటీ)తో స‌హా ఈక్వీటీ నుంచి వ‌చ్చే లాభాల‌పై ప‌న్నును త‌గ్గించ‌డానికి ప్ర‌భుత్వం కృషిచేస్తొంది. భార‌తీయ కంపెనీలు తమ వాటాదారులకు పంచే డివిడెండుపై ప్రస్తుతం 20.35 శాతం (సెస్సులు, సర్‌చార్జీలన్నీ కలిపి) డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ను చెల్లిస్తున్నాయి.

పెట్టుబడులను ప్రోత్సహించే ఉద్దేశంతో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ ను రద్దు చేయాలని డైరెక్ట్ టాక్స్ కోడ్ (డీటీసీ) టాస్క్ ఫోర్స్ సిఫారసు చేస్తోంది. అయితే ప్ర‌తిపాదిత ఎల్‌టీసీజీ, ఎస్‌టీసీజీ, డీడీటీ, ఇత‌ర‌త్రా రేట్ల త‌గ్గింపు వ‌ల్ల 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఆదాయాలు రూ.1.5 ల‌క్ష‌ల కోట్లు వ‌ర‌కు త‌గ్గ‌వ‌చ్చు. అయితే ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల ఆస్తుల విక్ర‌యం, మెరుగైన ప‌న్ను ఆదాయాలు, వ్య‌యాల త‌గ్గింపు త‌దిత‌రాల ద్వారా ఈ అంత‌రాన్ని పూడ్చ‌వ‌చ్చిన అధికారులు వివ‌రిస్తున్నారు.

డివిడెండ్ డిస్ట్రిబ్యూష‌న్ ట్యాక్స్ గురించి 5 ముఖ్య విష‌యాలు:

  1. షేర్ హోల్డ‌ర్‌కి ల‌భించే డివిడెండ్‌పై పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. అయితే సంస్థ డివిడెండ్ చెల్లించే ముందే డివిడెండ్ డిస్ర్టిబ్యూష‌న్ ప‌న్నును మిన‌హాయించి ఇస్తారు.

  2. 2017 నుంచి మొత్తం డివిడెండ్ ఆదాయం ఏడాదికి రూ.10 ల‌క్ష‌లు దాటితే 10 శాతం అద‌న‌పు ఆదాయ‌పు ప‌న్ను వ‌ర్తిస్తుంది. అయితే ఇది రూ.10 ల‌క్ష‌ల పైన వ‌చ్చే అద‌న‌పు మొత్తంపై మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.

  3. డివిడెండ్ డిస్ట్రిబ్యూష‌న్ ట్యాక్స్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌పై కూడా వ‌ర్తిస్తుంది. ఫండ్ హౌస్‌లు డీడీటీని మిన‌హాయించిన త‌రువాత మాత్ర‌మే డివిడెండ్ల‌ను మ‌దుప‌ర్ల‌కు చెల్లిస్తాయి. అందువ‌ల్ల మ్యూచువ‌ల్ ఫండ్ ఫ‌థ‌కాల‌పై పెట్టుబ‌డిదారుల‌కు ప‌న్ను వ‌ర్తించ‌దు, కానీ వ‌చ్చే లాభం మాత్రం కొంత త‌గ్గుతుంది.

  4. 2018 బ‌డ్జెట్‌లో ఈక్వీటీ ఓరియంట‌డ్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌కు డీడీటీని ప్ర‌వేశ‌పెట్టారు. ఇత‌ర ఛార్జీలు, సెస్‌తో క‌లిపి 11.648 శాతం ప‌న్ను మిన‌హాయించి పెట్టుబ‌డుదారుల‌కు డివిడెండ్ అందిస్తారు.

  5. డెట్ ఓరియంటెడ్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌పై ల‌భించే డివిడెండ్‌పై, డివిడెండ్ డిస్ర్టిబ్యూష‌న్ ప‌న్ను 29.12 శాతం మిన‌హాయించి పెట్టుబ‌డుదారుల‌కు డివిడెండ్ అందిస్తారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly