సాంప్ర‌దాయ బీమా పాల‌సీల‌ను స‌రెండ‌ర్ చేయాల‌నుకుంటున్నారా?

పాల‌సీ సరెండర్ విలువ హామీ మొత్తం, బోనస్, కాల‌వ్య‌వ‌ధి, చెల్లించిన ప్రీమియంలపై ఆధారపడి ఉంటుంది.

సాంప్ర‌దాయ బీమా పాల‌సీల‌ను స‌రెండ‌ర్ చేయాల‌నుకుంటున్నారా?

సాంప్ర‌దాయ పాల‌సీల్లో బీమా ప్రీమియం ఎక్కువ‌గా, హామీ మొత్తం త‌క్కువ‌గా ఉంటుంది. చాలా మంది పాల‌సీదారులు తెలియ‌క ఇలాంటి పాల‌సీలు తీసుకుంటుంటారు. వీటిలో క‌నీసం మూడేళ్లు చెల్లించాల‌ని నిమ‌యం ఉంటుంది. కాబ‌ట్టి పాల‌సీదారులు క‌నీసం చెల్లించాల్సిన ప్రీమియంలు పూర్త‌య్యాక త‌మ సంప్ర‌దాయ పాల‌సీల‌ను స‌రెండ‌ర్ చేసి వాటికి క‌ట్టే ప్రీమియంను ఈక్విటీ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెడితే మీరు ఇంత వ‌ర‌కు క‌ట్టిన ప్రీమియంలో స‌హా న‌ష్ట‌పోయిన మొత్తం కంటే ఎక్కువ రాబ‌డి పొంద‌వ‌చ్చు. అందులో కొంత మొత్తంతో ట‌ర్మ్ జీవిత బీమా పాల‌సీని తీసుకోవ‌డం ద్వారా భ‌ద్ర‌త‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కి 30 ఏళ్ల వ్య‌క్తి , పాల‌సీ కాల‌ప‌రిమితి 20 ఏళ్లు , బీమా హామీ రూ. 3 ల‌క్ష‌లు చొప్పున నాలుగు పాల‌సీల‌ను కొనుగోలు చేశాడ‌నుకుందాం. నాలుగు పాల‌సీల‌కుగాను వార్షికంగా రూ.60,000 ప్రీమియం చెల్లించాలి.

రెండు సంవ‌త్స‌రాలు ప్రీమియం చెల్లించిన అనంత‌రం,

 • చెల్లించిన‌ ప్రీమియం : రూ 1.2 ల‌క్ష‌లు
 • చివ‌రి వ‌ర‌కు పాల‌సీ కొన‌సాగిస్తే వ‌చ్చే మెచ్యూరిటీ మొత్తం( వ‌డ్డీ 6 శాతం చొప్పున) : రూ.20.29 ల‌క్ష‌లు

 • మిగిలిన 18 సంవ‌త్స‌రాలు అదే రూ.60 వేల ప్రీమియం ఈక్విటీ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెడితే (వ‌డ్డీ 12 శాతం చొప్పున) : రూ.35.25 ల‌క్ష‌లు

 • ఈ 18 సంవ‌త్స‌రాల రాబ‌డి నుంచి 2 సంవ‌త్స‌రాల‌కి చెల్లించిన‌ ప్రీమియం తీసివేస్తే వ‌చ్చే ఆదాయం: రూ. 34.04 ల‌క్ష‌లు

ఐదు సంవ‌త్స‌రాలు ప్రీమియం చెల్లించిన అనంత‌రం పాల‌సీ అప్ప‌గిస్తే

 • చెల్లించిన‌ ప్రీమియం : క‌ట్టిన ప్రీమియం (రూ .3.6 ల‌క్ష‌లు) - (స‌రెండ‌ర్ విలువ రూ. 52 వేలు) = రూ. 3.08 ల‌క్ష‌లు

 • చివ‌రి వ‌ర‌కు పాల‌సీ కొన‌సాగిస్తే వ‌చ్చే మెచ్యూరిటీ మొత్తం( వ‌డ్డీ 6 శాతం చొప్పున) : రూ.20.29 ల‌క్ష‌లు

 • మిగిలిన 18 సంవ‌త్స‌రాలు అదే రూ.60 వేల ప్రీమియం ఈక్విటీ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెడితే (వ‌డ్డీ 12 శాతం చొప్పున) : రూ.23.57ల‌క్ష‌లు

 • ఈ 15 సంవ‌త్స‌రాల రాబ‌డి నుంచి 5 సంవ‌త్స‌రాల‌కి కోల్పోయిన ప్రీమియం తీసివేస్తే వ‌చ్చే ఆదాయం: రూ. 20.49 ల‌క్ష‌లు

 • రెండు సంద‌ర్భాల‌లోను చెల్లించిన‌ ప్రీమియం, స‌రెండ‌ర్ వ్యాల్యూ కంటే మిగిలిన సంవ‌త్స‌రాల‌కు ఈక్విటీల‌లో పెట్టుబ‌డి పెట్ట‌గా వ‌చ్చిన ఆదాయం ఎక్కువ‌.

సరెండర్ విలువ అంటే ఏమిటి?

జీవిత బీమా విషయంలో, పాల‌సీ కాల‌వ్య‌వ‌ధి పూర్తి కావ‌డానికి ముందుగానే అప్ప‌గిస్తే (స‌రెండ‌ర్ చేస్తే), ప్రీమియం క‌ట్టిన మొత్తంలో చార్జీల‌ను తీసివేయ‌గా మిగిలిన మొత్తాన్ని మీకు చెల్తిస్తారు. దీనినే స‌రెండ‌ర్ విలువ అంటారు.

అన్ని జీవిత బీమా పాల‌సీల‌లో స‌రెండ‌ర్ విలువ పొంద‌వ‌చ్చా?

పొంద‌లేము, బీమాతో పాటు పొదుపు, పెట్టుబ‌డి భాగాన్ని క‌లిపి ఉన్న పాల‌సీల విష‌యంలో మాత్ర‌మే సరెండ‌ర్ విలువ పొంద‌గ‌ల‌ము. పూర్తిగా ట‌ర్మ ప్లానుతో ఉన్న పాల‌సీల‌కు ఎటువంటి స‌రెండ‌ర్ విలువ ఉండ‌దు. సంప్రాదాయ ప‌థ‌కాలైన ఎండోమెంట్‌, మ‌నీబ్యాక్‌, యులిప్స్ వంటి వాటికి స‌రెండ‌ర్ విలువ ఇస్తారు.

ప్రీమియం చెల్లించ‌డం ఆపేస్తే స‌రెండ‌ర్ విలువ వ‌స్తుందా?

ప్రీమియం చెల్లింపు వ్య‌వ‌ధి 10 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ ఉండి క‌నీసం రెండు సంవ‌త్స‌రాల నిరంత‌ర ప్రీమ‌యం చెల్లించినా, ప్రీమియం చెల్లింపు వ్య‌వ‌ధి 10 సంవ‌త్స‌రాల కంటే ఎక్కువ ఉండి క‌నీసం మూడు సంవ‌త్స‌రాల నిరంత‌ర ప్రీమ‌యం చెల్లించినా, మీరు చెల్లించిన ప్రీమియంల నుండి కొంత మొత్తాన్ని ఇస్తారు. దీని కంటే ముందుగానే పాల‌సీ వెన‌క్కి ఇచ్చిన‌ట్ల‌యితే స‌రెండ‌ర్ విలువ ఉండ‌దు.

ప్రీమియం చెల్లించడం ఆపివేసిన‌ త‌రువాత కూడా బీమాను కొన‌గించ‌వ‌చ్చా?

మీ బీమా ప‌థ‌కంను పెయిడ్ అప్ పాల‌సీలోనికి మార్చువ‌చ్చు. కానీ 2/3 సంవ‌త్స‌రాలు ప్రీమియం చెల్లించిన త‌ర్వాత మాత్ర‌మే ప్రీమియం ఆపివేసిన బీమాను కొన‌సాగించ‌వ‌చ్చు. పాల‌సీదారులు ప్రీమియం చెల్లించిన మొత్తానికి అనుగుణంగా బీమా హామీ త‌గ్గుతుంది. దీనినే పెయిడ్ అప్ విలువ అంటారు. పేయిడ్ అప్ విలువ‌ల‌ను ఈ కింది ఫార్ములా ఉప‌యోగించి లెక్కించ‌వ‌వ‌చ్చు.

పెయిడ్ అప్ విలువ = (చెల్లించిన ప్రీమియంలు / చెల్లించవలసిన ప్రీమియంలు) x హామీ మొత్తం.

సాంప్ర‌దాయ ప‌థ‌కాల‌లో ఎంత మొత్తం తిరిగి పొంద‌వ‌చ్చు?

2/3 సంవ‌త్స‌రాల ప్రీమియం చెల్లించిన అనంత‌రం స‌రెండ‌ర్ విలువ పొంద‌వ‌చ్చు. ఇది రెండు ర‌కాలుగా ఉంటుంది.

 1. క‌చ్చిత‌మైన స‌రెండ‌ర్ విలువ‌:

ఎప్పుడు స‌రెండ‌ర్ చేస్తారనే దాని ఆధారంగా క‌చ్చిత‌మైన విలువ‌ పొంద‌వ‌చ్చు.

 • 2/3 సంవ‌త్స‌రాలు చెల్లించిన అనంత‌రం స‌రండ‌ర్ చేస్తే, చెల్లించిన ప్రీమియం నుంచి 30 శాతం హామీ అందిస్తారు.

 • 4-7 సంవ‌త్స‌రాలు చెల్లించిన అనంత‌రం స‌రండ‌ర్ చేస్తే, చెల్లించిన ప్రీమియం నుంచి 50 శాతం హామీ అందిస్తారు.

 • పాల‌సీ ముగుంపు గ‌డువు రెండు సంవ‌త్స‌రాలు ఉన్న‌ప్పుడు స‌రండ‌ర్ చేస్తే, చెల్లించిన ప్రీమియం నుంచి 90 శాతం హామీ అందిస్తారు.

 1. స్పెషల్ సరెండర్ విలువ:

ఈ సరెండర్ విలువ హామీ మొత్తం, బోనస్, కాల‌వ్య‌వ‌ధి, చెల్లించిన ప్రీమియంలపై ఆధారపడి ఉంటుంది. ఈ కింది ఫార్ములా ఉపయోగించి స‌రెండ‌ర్ విలువ‌ లెక్కించవచ్చు.

ప్రత్యేక సరెండర్ విలువ = (చెల్లింపు విలువ + బోనస్) x సరెండర్ విలువ కారకం

సరెండర్ విలువ కారకం చెల్లింపు విలువ, బోనస్ శాతం ఆధారంగా లెక్కిస్తారు

యులిప్స్‌లో ఎంత మొత్తాన్ని తిరిగి పొందవ‌చ్చు?

లాక్-ఇన్ పీరియ‌డ్ 5 సంవ‌త్స‌రాలు. దాని కంటే ముందే ముందు ప్రీమియం చెల్లించడం ఆపేస్తే పాల‌సీ ర‌ద్దు అవుతుంది. కొంత మొత్తాన్నిచార్జీల నిమిత్తం తీసివేసి మిగిలిన మొత్తాన్ని పాల‌సీదారుల‌కు చెల్లిస్తారు. ఇలాంటి సంద‌ర్భాల్లో 3.5 శాతం చొప్పున రాబ‌డి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

పాల‌సీ చెల్లింపులు మొద‌టి సంవ‌త్స‌రంలో ర‌ద్దు చేస్తే రుసుములు గ‌రిష్టంగా రూ. 6000, నాల్గ‌వ సంవ‌త్స‌రంలో ర‌ద్దు చేస్తే రూ.2000 వ‌ర‌కూ ఉంటాయి. ఆఖ‌రి సంవ‌త్స‌రంలో ర‌ద్దు చేస్తే ఏవిధ‌మైన చార్జీలు ఉండ‌వు. ఫండు మేనేజ‌ర్ రుసుము చెల్లించాలి. అయితే ఇది 0.5 శాతానికి మించ‌కుండా ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly