దిద్దుబాటు ముగిసిందా?

ఏదైనా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో పొదుపు చేసిన మొత్తం పెట్టుబ‌డులుగా మారి వ్యాపార‌కార్య‌క‌లాపాలు పెరిగిన‌పుడు వృద్ధిరేటు బావుంటుంది.

దిద్దుబాటు ముగిసిందా?

అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు త‌గ్గుతున్న నేప‌థ్యంలో మ‌న దేశీయ మార్కెట్లకు అనుకూలంగా ఉంటుంద‌ని మ‌దుప‌ర్లు భావిస్తున్నారు. ముడిచ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌డం వ‌ల్ల మార్కెట్లు అనుకూలంగా ఉండేందుకు అవ‌కాశం ఉందా?

సుమారు 15 శాతం త‌గ్గి

అంత‌ర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధ‌ర ఇటీవ‌లె తాకిన గ‌రిష్ట ధ‌ర 85.83 డాల‌ర్ల నుంచి సుమారు 15 శాతం త‌గ్గి శుక్ర‌వారం నాటికి 72.83 డాల‌ర్ల‌కు చేరింది. దీంతో రూపాయి పై ఒత్తిడి త‌గ్గి తిరిగి విదేశీ పెట్టుబ‌డులు మార్కెట్ల‌లోకి వ‌స్తాయ‌ని విశ్వాసం ఏర్ప‌డుతోంది. చైనా అమెరికామ‌ధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందా? ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో మార్కెట్లో దిద్దుబాటు ఇక ముగిసిన‌ట్టేనా అనే ప్ర‌శ్న‌లు మ‌దుప‌ర్ల‌లో క‌లుగుతున్నాయి.

ముడిచ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌డం ద్వారా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు బ‌లం చేకూరుతుంది.మ‌న దేశం 80 శాతం ముడిచ‌మురు దిగుమ‌తులు చేసుకుంటుంది కాబ‌ట్టి వాటి ధ‌ర‌లు త‌గ్గ‌డం ద్వారా ప్ర‌యోజ‌నం ఉంటుంది. ద్ర‌వ్యోల్బ‌ణ కూడా అదుపులోకి వ‌స్తుంది. వ‌డ్డీరేట్లు పెరిగేందుకు అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది. ఈ ప‌రిణామం వ్యాపార కార్య‌క‌లాపాల‌కు అనుకూలంగా ఉంటుంది. వ‌డ్డీ రేట్లు త‌గ్గ‌డం వ‌ల్ల దేశంలో ఉండే పొదుపులు పెట్టుబ‌డులుగా మారేందుకు అవ‌కాశం ఉంటుంది. ఏదైనా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో పొదుపు చేసిన మొత్తం పెట్టుబ‌డులుగా మారి వ్యాపార‌కార్య‌క‌లాపాలు పెరిగిన‌పుడు వృద్ధిరేటు బావుంటుంది. కాబ‌ట్టి మ‌డిచ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌డం మ‌న దేశానికి సానుకూల అంశ‌మ‌నే చెప్పాలి.

నిపుణులు - నివేదిక‌లు

ముడి చ‌మురు ధ‌ర‌లు ప్ర‌స్తుత స్థాయిలో ఉంటాయా అనేది అప్పుడే అంచ‌నా వేయ‌లేం అని కొంద‌రు నిపుణులు అంటున్నారు. ఆర్థిక సంవ‌త్స‌రం 2019 లో స‌గ‌టు బ్యారెల్ ధ‌ర 75 డాల‌ర్లు, 2020 కి స‌గ‌టు 78 డాల‌ర్లు ఉంటుంద‌ని స్టాండ‌ర్డ్ చార్ట‌ల్ బ్యాంకు అంచ‌నా వేసింది. అంత‌ర్జాతీయ శ‌క్తివ‌న‌రుల ఏజెన్సీ విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం సంవ‌త్స‌రాల‌కు గానూ ముడిచ‌మురు డిమాండ్ త‌గ్గుతుంద‌ని పేర్కొంది. రోజుకు1.1 ల‌క్ష‌లు త‌గ్గి 2018 లో రోజుకు 1.3 మిలియ‌న్ డాల‌ర్లు ,2019 లో 1.4 మిలియ‌న్ డాల‌ర్లు ఉండొచ్చ‌ని అంచ‌నా.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఈనాడు సిరి ఫేస్ బుక్ పేజీ ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly