సోష‌ల్ మీడియాలో పాన్ స‌మాచారం వెల్ల‌డించ‌కండి..ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌

ప‌న్ను సంబంధిత సందేహాల నివృత్తి కోసం ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఆన్‌లైన్ ప్ర‌శ్న ఫార‌మ్‌ను తీసుకువ‌చ్చింది

సోష‌ల్ మీడియాలో పాన్ స‌మాచారం వెల్ల‌డించ‌కండి..ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌

సామాజిక మాధ్య‌మాల‌లో ప‌ది అంకెల‌తో కూడిన ఆల్ఫాన్యూమ‌రిక్ పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) స‌మాచారాన్ని షేర్ చేయోద్ద‌ని పాన్ కార్డు హోల్డ‌ర్ల‌ను ఆదాయ‌పు ప‌న్ను శాఖ హెచ్చ‌రించింది. సోష‌ల్ మీడియాలో ఉంచే వ్య‌క్తిగ‌త స‌మాచారం దుర్వినియోగం అవుతుంద‌ని ఆదాయ‌పు ప‌న్ను శాఖ పేర్కొంది.

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను ఫైల్ చేయు విధానం, ఐటీఆర్ రీఫండ్ల గురించి ట్విట్ట‌ర్ వంటి సామాజిక మాధ్య‌మాల్లో చాలా మంది ప‌న్ను చెల్లింపు దారులు సందేహాలు, ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విధ‌మైన సందేహాల నివృత్తికి కొంత మంది వారి పాన్ స‌మాచారాన్ని వెల్ల‌డిస్తున్నారు. ఆదాయ‌పు ప‌న్ను శాఖ సోష‌ల్ మీడియా విభాగం ఇటువంటి ప‌న్ను చెల్లింపుదారుల‌ను గుర్తించి వారిని హెచ్చ‌రిస్తూనే ఉంది. పాన్‌తో సహా వ్యక్తిగత స‌మాచారాన్ని బ‌హిర్గ‌తం చేయ‌డం, గుర్తింపు దొంగతనం కేసులకు దారితీస్తుంది, మీ ప్ర‌మేయం లేకుండా, మీకు తెలియ‌కుండానే లావాదేవీలు చేసేందుకు దోహ‌దం చేస్తుంది.

ప‌న్ను సంబంధిత సందేహాలను అడ‌గాల‌నుకునే వారి కోసం ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఆన్‌లైన్ ప్ర‌శ్న ఫార‌మ్‌ను తీసుకువ‌చ్చింది. ప‌న్ను చెల్లింపు దారులు వారి సందేహాల‌ను ఇక్క‌డ తెలియ‌ప‌ర‌చి, ఐటీ అధికారుల నుంచి నేరుగా స‌మాధానం పొంద‌వ‌చ్చు.

ఈ ఫార‌మ్‌లో మీ పేరు, పాన్, ఏ అసెస్మెంట్ సంవ‌త్స‌రానికి సంబంధించిన స‌మ‌స్య‌, మొబైల్ నెంబ‌రు, ఈమెయిల్ ఐడీ, సోష‌ల్ మీడియా యూస‌ర్ ఐడీతో పాటు వివ‌రణాత్మ‌కంగా సందేహాన్ని తెలియ‌జేయాల్సి ఉంటుంది. ఈ ఫార‌మ్‌లో ప్ర‌ధానంగా ఇ-ఫైల్లింగ్ ఐటీఆర్‌, ప్రాసెసింగ్‌, ప‌న్ను రిఫండ్ క్లెమ్ చేయ‌డం వంటి వాటికి సంబంధించిన ప్ర‌శ్న‌లకు స‌మాధానాలు తెలియ‌జేస్తారు. మీరు ఒక‌సారి ఈ ఫార‌మ్‌ను నింపి ఆదాయ‌పు శాఖ‌కు పంపించిన త‌రువాత‌, వీలైనంత తొంద‌రలో మీ సందేహాల‌ను నివృత్తి చేయ‌డం లేదా మీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తారు.

అదేవిధంగా 12 అంకెల‌తో కూడిన ఆధార్ గుర్తింపు సంఖ్య స‌మాచారాన్ని కూడా ఇత‌ర వ్య‌క్తుల‌కు తెలియ‌జేయ‌వ‌ద్ద‌ని యూనిక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఆధార్ కార్డు హోల్డ‌ర్ల‌ను కోరింది. ఆధార్ సంఖ్య పాన్ కార్డు, బ్యాంకు ఖాతా, పాస్‌పోర్ట్ వంటి వాటితో అనుసంధానించ‌బ‌డ‌టం వ‌ల్ల ఆధార్ స‌మాచారాన్ని వెల్ల‌డిస్తే ఇత‌ర ముఖ్య స‌మాచారం కూడా బ‌హిర్గ‌తం అయ్యే అవ‌కాశం ఉంటుంది.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly