సుక‌న్య స‌మృద్ధి ఖాతా ప్ర‌యోజ‌నాలు..ప‌రిమితులు

సుక‌న్య స‌మృద్ధి ఖాతా ప్రారంభించే ముందు అందులో ఉన్న ప్ర‌యోజ‌నాల‌తో పాటు లోపాల‌ను కూడా తెలుసుకోవాలి

సుక‌న్య స‌మృద్ధి ఖాతా ప్ర‌యోజ‌నాలు..ప‌రిమితులు

సుకన్య స‌మృద్ధి ఖాతాకు ప్ర‌స్తుతం చాలా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ ప‌థ‌కాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ‘బేటీ బ‌చావో-బేటీ ప‌డావో’ కార్య‌క్ర‌మంలో భాగంగా జ‌న‌వ‌రి 22, 2015 న‌ ప్రారంభించారు. ఇందులో ముఖ్య‌మైన ప్ర‌యోజ‌నాలు ఏంటంటే ఇత‌ర చిన్న పొదుపు ప‌థ‌కాల‌తో పోలిస్తే ఎక్కువ వ‌డ్డీ రేటు, ప‌న్ను మిన‌హాయింపులు వంటివి. దీంతో ఆడ‌పిల్ల‌ల కోసం మ‌ధ్య‌త‌ర‌గ‌తివారు ఇందులో పెట్టుబ‌డులు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ ప‌థ‌కంలో కొన్ని ప్ర‌తికూల‌త‌లు కూడా ఉన్నాయి. పెట్టుబ‌డులు పెట్టేముందు వాటి గురించి కూడా తెలుసుకోవ‌డం మంచిది.

 1. లాక్‌-ఇన్ పీరియ‌డ్‌
  సుక‌న్య స‌మృద్ధి ఖాతా దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. కాల‌ప‌రిమితి 21 సంవ‌త్స‌రాలు. ఈ ఖాతాలో 14 సంవ‌త్స‌రాలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 21 సంవ‌త్స‌రాల లాక్-ఇన్ పీరియ‌డ్ అంటే చాలా ఎక్కువ కాలం అనే చెప్పుకోవాలి. స్వ‌ల్ప కాలంలో లాభాల కోసం వేచి చూసేవారు ఇత‌ర పెట్టుబ‌డుల‌ను ప‌రిశీలించ‌డం మంచిది.

 2. ఆన్‌లైన్ స‌దుపాయం ఉండ‌దు
  సుక‌న్య స‌మృద్ధిలో ఉండే మ‌రో లోపం ఏంటంటే ఆన్‌లైన్ ద్వారా పెట్టుబ‌డి చేసే అవ‌కాశం లేదు. కేవ‌లం చెక్కు, న‌గ‌దు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మాత్ర‌మే డిపాజిట్ చేయాలి. ప్ర‌భుత్వం డిజిట‌ల్ ఇండియా కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌భుత్వం దీనిని ఆన్‌లైన్ చేస్తే పెట్టుబ‌డుల‌కు సౌక‌ర్యంగా ఉంటుంది.

 1. వ‌డ్డీ రేట్లు
  సుక‌న్య స‌మృద్ధి ఖాతాపై ప్ర‌తీ త్రైమాసికానికి వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌భుత్వం స‌వ‌రిస్తుంటుంది. ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు 8.40 శాతంగా ఉంది. ఇది పీపీఎఫ్ వంటి ఇత‌ర పొదుపు ప‌థ‌కాల కంటే కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. అయితే మార్కెట్ ఆధారిత ప‌థ‌కాల‌తో పోలిస్తే ఇందులో లాభాలు త‌క్కువ‌గానే ఉంటాయి.

 2. ముంద‌స్తు ఉపసంహ‌ర‌ణ‌కు వీల్లేదు
  ఈ ఖాతా నుంచి ముంద‌స్తుగా డ‌బ్బును తీసుకునేందుకు అవ‌కాశం ఉండ‌దు. ఇక్క‌డ అత్య‌వ‌స‌ర‌మైన‌ప్పుడు డ‌బ్బు తీసుకోలేము. లిక్విడిటీ స‌మ‌స్య ఈ ఖాతాకు ప్ర‌తికూలమ‌నే చెప్ప‌వ‌చ్చు.

 3. వ‌య‌సు ప‌రిమితి
  సుక‌న్య స‌మృద్ధి ఖాతా ప‌దేళ్ల వ‌ర‌కు వ‌య‌సు ఉన్న ఆడ‌పిల్ల‌ల పేరుతో మాత్ర‌మే ప్రారంభించే అవ‌కాశం ఉంది. ఖాతా ప్రారంభ స‌మ‌యంలో పిల్ల‌ల వ‌య‌సుకి సంబంధించిన ఆధారాన్ని స‌మ‌ర్పించాలి.

 4. రుణ స‌దుపాయం లేదు
  ఈ ప‌థ‌కం రుణ స‌దుపాయాన్ని క‌ల్పించ‌లేదు. ఒక‌వేళ కుటుంబ ప‌రిస్థితి బాగాలేక‌పోతే దీని ద్వారా రుణం పొందే అవ‌కాశం లేదు.

 5. బాలిక పేరుతో ఖాతా
  సుక‌న్య స‌మృద్ధి ఖాతా అమ్మాయి పేరుతో ప్రారంభించాల్సి ఉంటుంది. దీనిని ఖాతాదారు కూడా నిర్వ‌హించేందుకు అవ‌కాశం ఉంది. ఒక వ‌య‌సు వ‌చ్చాక అమ్మాయి త‌ల్లిదండ్రుల మాట విన‌కుంటే స‌మ‌స్య రావొచ్చు.

చివ‌ర‌గా…
సుకన్య స‌మృద్ధి ఖాతాతో ముఖ్యంగా అమ్మాయిల ఉన్న‌త చ‌దువు, వివాహానికి భ‌రోసా ల‌భిస్తుంది. దీనికోసం ఈ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. భ‌విష్య‌త్తులో ప్ర‌భుత్వం దీనిలో మ‌రిన్ని మార్పులు కూడా చేసే ప్ర‌తికూల‌త‌ల‌ను లేకుండా కూడా చేసే అవ‌కాశం లేక‌పోలేదు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly