ఒకే ఫార‌మ్‌తో పీఎఫ్ ఆన్‌లైన్ విత్‌డ్రాలు

ఫార‌మ్ 19, ఫార‌మ్ 10సీ, ఫార‌మ్ 31ల స్థానంలో ఒకే ఫార‌మ్‌ను ఈపీఎఫ్ఓ ప్ర‌వేశ‌పెట్టింది.

ఒకే ఫార‌మ్‌తో పీఎఫ్ ఆన్‌లైన్ విత్‌డ్రాలు

ఆన్‌లైన్ ద్వారా ఉన్న చోటు నుంచే ప్రావిడెండ్ ఫండ్‌(పీఎఫ్‌)ను ఉప‌సంహ‌రించుకునే సేవ‌ల‌ను ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్‌ (ఈపీఎఫ్ఓ) ఉద్యోగుల‌కు అందిస్తుంది. విత్‌డ్రా విధానాన్ని సుల‌భ‌త‌రం, వేగ‌వంతం చేసేందుకు ఒక పేజితో కూడిన కాంపోజిట్ ఫార‌మ్‌ను ప్రావిడెండ్ ఫండ్ ఆర్గ‌నైజ‌న్ ప్ర‌వేశ‌పెట్టింది. యూనివ‌ర్సల్ ఖాతా నెంబ‌రు(యూఏఎన్‌)ను ఆధార్‌తో అనుసంధానించిన ఈపీఎఫ్ చందాదారులు కోసం ఈ ఫార‌మ్‌ను రూపొందించిన‌ట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. ప్రావిడెండ్ ఫండ్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు గానూ ఇంత‌కు ముందు ఫార‌మ్ 19, ఫార‌మ్ 10సీ, ఫార‌మ్ 31 మొద‌లైన ప‌లు ర‌కాల ఫార‌మ్‌ల‌ను ఉప‌యోగించే వారు. అయితే వీటి స్థానంలో ఒకే పేజిలో ఉండే కాంపోజిట్ క్లెయిమ్‌ ఫార‌మ్ ద్వారా పీఎఫ్‌ విత్‌డ్రా చేసుకునే స‌దుపాయాన్ని ఈపీఎఫ్ఓ క‌ల్పిస్తుంది. ఇది వ‌ర‌కు పీఎఫ్‌ క్లెయిమ్ ఫార‌మ్‌పై, సంస్థ య‌జ‌మాని అటస్టేష‌న్ తీసుకోవ‌ల‌సి వ‌చ్చేది. ఈ ఒక పేజి కాంపోజిట్ క్లెయిమ్ ఫార‌మ్‌పై సంస్థ య‌జ‌మాని అట‌స్టేష‌న్ అవ‌స‌రం లేదు. ఇందుకు బ‌దులుగా చందాదారుడు స్వ‌యంగా అటాస్టేష‌న్ చేస్తే స‌రిపోతుంది. పీఎఫ్‌ బ్యాలెన్స్ ఉపసంహ‌రించుకునేందుకు గానూ ఇంత‌కు ముందు మూడు విత్‌డ్రా ఫార‌మ్‌లను ఈపీఎఫ్ఓ అనుమ‌తించేది.

  1. ఫార‌మ్ 19 - ఆఖ‌రి పీఎఫ్ సెటిల్‌మెంట్ కోసం
  2. ఫార‌మ్ 10సీ - పెన్ష‌న్ విత్‌డ్రా కోసం
  3. ఫార‌మ్ 31 - తిరిగి చెల్లించ‌న‌వ‌స‌రం లేని పీఎఫ్ అడ్వాన్సుల కోసం ఈ ఫార‌మ్‌ల‌ను ఉప‌యోగించేవారు.

ప్ర‌స్తుతం ఈపీఎఫ్ఓ, ఈ ఫార‌మ్ అన్నింటి స్థానంలో కాంపోజిట్ క్ల‌యిమ్ ఫార‌మ్‌ను తీసుకోవ‌చ్చింది. మీరు ఏర‌కంగా పీఎఫ్ బ్యాలెన్సును విత్‌డ్రా చేసుకోవాల‌న్న ఈఫార‌మ్‌నే ఉప‌యోగించాలి. ఇందులో మొద‌టిగా విత్‌డ్రా స్వ‌భావం అడుగుతుంది. ఇల్లు లేదా స్థ‌లం కొనుగోలు, గృహ రుణం తిరిగి చెల్లించేందుకు, పీఫ్‌ బ్యాలెన్స్‌ విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. వైద్య ఖ‌ర్చులు, పిల్ల‌ల పైచ‌దువులు, వివాహం వంటి ఇత‌ర కార‌ణాల‌కు విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు. ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యానికంటే ఒక ఏడాది ముందుగానే పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

పీఎఫ్ విత్‌డ్రాల‌కు ఆధార్‌, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా వివ‌రాలు అవ‌స‌ర‌మ‌వుతాయి. క్లెయ‌మ్ చేసేందుకు ఇత‌ర ప‌త్రాలు ఇవ్వాల్సిన ప‌నిలేదు. పీఎఫ్ నియ‌మాల ప్ర‌కారం, క‌నీసం 5 సంవ‌త్స‌రాలు నిరంత‌రంగా ఉద్యోగంలో క‌న‌సాగ‌క పోతే, శాల‌రీ నుంచి వ‌చ్చే ఆదాయం కింద ప‌రిగ‌ణించి పీఎఫ్ విత్‌డ్రాల‌పై ప‌న్ను విధిస్తారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly