రూ.45 వేల కోట్ల‌కు ఈపీఎఫ్ఓ పెట్టుబ‌డులు

ప్ర‌స్తుత‌ ఆర్థిక సంవ‌త్స‌రంలో స్టాక్ మార్కెట్ల‌లో ఈపీఎఫ్ఓ పెట్టుబ‌డులు రూ.45 వేల కోట్ల‌ను మించ‌నున్న‌ట్లు కార్మిక మంత్రి తెలిపారు.

రూ.45 వేల కోట్ల‌కు ఈపీఎఫ్ఓ పెట్టుబ‌డులు

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల‌(ఈటీఎఫ్‌) రూపంలో ఉద్యోగ భ‌విష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) పెట్టుబ‌డులు రూ.45 వేల కోట్ల‌ను మించ‌నున్నాయ‌ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు ద‌త్తాత్రేయ అన్నారు. పెట్టుబ‌డుల ప‌రిమితిని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచేందుకు గ‌త నెల‌లో ఈపీఎఫ్ఓ ధ‌ర్మ క‌ర్త‌ల మండ‌లి అంగీక‌రించిన నేప‌థ్యంలో ఆయన ఈ వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై ఆయ‌న ఇంకా మాట్లాడుతూ మార్కెట్ల ప‌నితీరు ప్ర‌స్తుతం ఆశాజ‌న‌కంగానే ఉంద‌నీ, మొత్తం మీద ఇది ఆహ్వ‌నించ‌ద‌గ్గ ప‌రిణామామ‌ని తెలిపారు.

ఏప్రిల్ 21 వ‌ర‌కు ఈపీఎఫ్ఓ పెట్టుబ‌డులు రూ.21,559 కోట్లుగా న‌మోద‌య్యాయ‌ని తెలిపారు. గ‌త ఆర్ధిక సంవ‌త్స‌రంలో పెట్టుబ‌డుల మీద 13.3 శాతం ప్ర‌తిఫ‌లం ల‌భించింద‌ని తెలిపారు. కార్మికుల ఉద్యోగాలు, వేత‌నాలు, సామాజిక భ‌ద్ర‌త‌కు సంబంధించి ప్ర‌స్తుత‌మున్న 44 చ‌ట్టాల‌ను 4 కోడ్లుగా స‌వ‌రించేందుకు ప్ర‌యత్నిస్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆటో మొబైల్ రంగంలో 2026 వ‌ర‌కు 6.5 కోట్ల ఉద్యోగాల‌ను సృష్టించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని అన్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly